16 రాష్ట్రాలు/యూటీలలోని 41 కొత్త నగరాలలో Jio True5Gతో అందుబాటులోకి వచ్చింది. దీంతో జియో 400 కంటే ఎక్కువ నగరాల్లో ట్రు 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించిన దేశంలోనే మొదటి కంపెనీగా అవతరించింది.
టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ట్రూ 5G సర్వీస్ ఇప్పుడు దేశంలోని 406 నగరాలకు చేరుకుంది. 5G రోల్‌అవుట్ వేగంలో రిలయన్స్ జియో పోటీ కంపెనీలు చాలా వెనుకబడి ఉన్నాయి. దీంతో జియో 400 కంటే ఎక్కువ నగరాల్లో ట్రు 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించిన దేశంలోనే మొదటి కంపెనీగా అవతరించింది. కొత్తగా ప్రవేశపెట్టిన చాలా నగరాల్లో 5Gని ప్రారంభించిన మొదటి టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో.
16 రాష్ట్రాలు/యూటీలలోని 41 కొత్త నగరాలలో Jio True5Gతో అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని, బద్వేల్, చిలకలూరిపేట, గుడివాడ, కదిరి, నర్సాపూర్, రాయచోటి, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, గోవాలోని మడ్‌గావ్, హర్యానాలోని ఫతేహాబాద్, గోహనా, హంసీ, నార్నాల్, పల్వాల్, హిమాచల్‌ప్రదేశ్‌లోని పౌంటా సాహిబ్‌ను కొత్తగా అనుసంధానించారు. కాశ్మీర్‌లోని రాజౌరి, జార్ఖండ్‌లోని దుమ్కా, కర్ణాటకలోని రాబర్ట్‌సన్‌పేట్, కేరళలోని కన్హంగాడ్, నెడుమంగడ్, తాలిపరంబ, తలస్సేరి, తిరువల్ల, మధ్యప్రదేశ్‌లోని బేతుల్, దేవాస్, విదిషా, మహారాష్ట్రలోని భండారా, వార్ధా, మిజోరంలోని లుంగ్లే, ఒడిశాలోని బ్యాసనగర్, రాయగడ, పంజాబ్‌లోని హోషియార్‌పూర్, రాజస్థాన్‌లోని టోంక్, తమిళనాడులోని కారైకుడి, కృష్ణగిరి, రాణిపేట్, తేని అల్లీనగరం, ఉదగమండలం, వాణియంబాడి ఇంకా త్రిపురలోని కుమార్‌ఘాట్ ఉన్నాయి.
undefined
ఏదైనా కొత్త నగరంలో తగినంత 5G కవరేజ్ ఉన్నప్పుడే Jio ట్రూ 5Gని విడుదల చేస్తుందని కంపెనీ పేర్కొంది. మిలియన్ల మంది యూజర్లు Jio True 5Gని ఉపయోగిస్తున్నారు ఇంకా కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, కంపెనీ ప్రపంచంలోనే అత్యుత్తమ 5G నెట్‌వర్క్‌ను రూపొందించడానికి ప్రయత్నిస్తోంది.
లాంచ్ సందర్భంగా, జియో ప్రతినిధి మాట్లాడుతూ, “దేశవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు జియో ట్రూ 5 జిని ఉపయోగించడం ప్రారంభించారు. మా నెట్‌వర్క్ బలం మా కస్టమర్ల జీవితాలను మెరుగుపరుస్తుందని మేము విశ్వసిస్తున్నాము. జియో ట్రు 5Gని వేగంగా విస్తరిస్తోంది. మేము దేశంలోని చాలా ప్రాంతాలను కవర్ చేసాము, ఇది మాకు చాలా గర్వకారణం. మా డిజిటలైజేషన్ ప్రయత్నాలకు సపోర్ట్ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, నిర్వాహకులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
మార్చి 21, 2023 నుండి కొత్తగా కనెక్ట్ చేయబడిన 41 నగరాల్లోని జియో వినియోగదారులు Jio వెల్‌కమ్ ఆఫర్ కింద ఆహ్వానించబడతారు. ఆహ్వానించబడిన వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 1 Gbps+ వేగంతో ఆన్ లిమిటెడ్ డేటాను పొందుతారు.