ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను ఫ్రీగా అప్‌డేట్ చేయడం ఎలా అంటే..?

By asianet news telugu  |  First Published Mar 20, 2023, 7:16 PM IST

మై ఆధార్ (MyAadhaar)పోర్టల్‌లో ఫ్రీ ఆధార్ అప్‌డేట్ సర్వీస్ ప్రవేశపెట్టినట్లు ఆధార్ అథారిటీ యూ‌ఐ‌డి‌ఏ‌ఐ తాజాగా ప్రకటించింది. ఈ ఉచిత సర్వీస్ మరో మూడు నెలల పాటు (జూన్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది,  


2009లో ఆధార్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారింది. కేంద్ర అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సుమారు 1,200 ప్రభుత్వ పథకాలు, సేవలను యాక్సెస్ చేయడంలో ఆధార్ ID కార్డ్ సహాయపడుతుంది.  

అయితే  ఆధార్ కార్డు ఉన్నవారు ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని ఇప్పుడు తీసుకొచ్చారు. ఈ ఉచిత సర్వీస్ మరో మూడు నెలల పాటు (జూన్ 14 వరకు) అందుబాటులో ఉంటుంది, అయితే పోస్టాఫీసులు ఇంకా సర్వీస్ కేంద్రాలలో ఆధార్‌ను అప్ డేట్ చేయడానికి రూ.50 చార్జ్ వసూలు చేయబడుతుంది. 

Latest Videos

undefined

ఈ మేరకు ఆధార్ అథారిటీ ఓ మెసేజ్ విడుదల చేసింది. దీని ప్రకారం, జనాభా వివరాలను ధృవీకరించడానికి ప్రజలు ఆధార్‌ను అప్‌డేట్ చేయాలని సిఫార్సు చేస్తుంది. ఆధార్ అప్‌డేట్‌కు గుర్తింపు పత్రం, అడ్రస్ ప్రూఫ్ (PoI/PoA) డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడం అవసరం. 

ముఖ్యంగా పదేళ్ల క్రితం ఆధార్ పొందిన వారు, అడ్రస్ తో సహా వారి వివరాలు మారినట్లయితే కొత్త చిరునామాను అప్‌డేట్ చేసుకోవచ్చు. myAadhaar సైట్‌ని సందర్శించడం ద్వారా దీన్ని అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ సైట్‌ని ఉపయోగించడం కూడా చాలా సులభం. 

అలాగే యూజర్లు ఫోన్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానించి ఉండాలి. అయితే ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ చేయవచ్చు, ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP (వన్ టైమ్ పాస్‌వర్డ్) పంపబడుతుంది. మీరు దానిని ఎంటర్ చేసి అవసరమైన మార్పులు కూడా చేయవచ్చు.

ఆధార్ కార్డ్‌లో అడ్రస్ ఎలా మార్చాలి?

మొదట UIDAI ఆధార్ సైట్‌కి వెళ్లండి: https://myaadhaar.uidai.gov.in/   వెబ్‌సైట్ హోమ్ పేజీలో చూపెట్టే  'మై ఆధార్'పై క్లిక్ చేయండి.

ఇప్పుడు, 'అప్‌డేట్ యువర్ ఆధార్' సెక్షన్ కింద, 'అప్‌డేట్ అడ్రస్ ఇన్ యువర్ ఆధార్'పై క్లిక్ చేయండి.

మీరు ఇప్పుడు లాగిన్ పేజీకి మళ్లించబడతారు. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయండి ఇంకా క్యాప్చాను ఎంటర్ చేయడం ద్వారా ధృవీకరించండి.

తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది. UIDAI సిస్టమ్‌కు లాగిన్ చేయడానికి OTPని ఎంటర్ చేయండి.

లాగిన్ ప్రాసెస్ తర్వాత, మీరు UIDAI వెబ్‌సైట్‌లో ఆధార్ కార్డ్ చిరునామా మార్పు డాష్‌బోర్డ్‌ను చూస్తారు. ఇప్పుడు 'ఆధార్ ఆన్‌లైన్‌  అప్‌డేట్' ఆప్షన్ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు మీరు 'ఆధార్ డేటా అప్‌డేట్' కింద అడ్రస్ సెలెక్ట్ చేసుకొని మీ చిరునామాను అప్ డేట్ చేసుకోవచ్చు.

click me!