నేడే పోకో ఎక్స్5 5జి ఫస్ట్ సేల్.. బ్యాంక్ ఆఫర్‌ కింద తక్కువ ధరకే..

పోకో ఎక్స్5 5జి అండ్రాయిడ్ 12 ఆధారిత MIUI 13ని పొందుతుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ ఆమోలెడ్ స్క్రీన్‌, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో 8జి‌బి ర్యామ్, 256జి‌బి వరకు స్టోరేజ్ ఉంది.
 

First sale of Poco X5 5G with AMOLED display and 256 GB storage today-sak

చైనీస్ కంపెనీ పోకో కొత్త ఫోన్ పోకో ఎక్స్5 5జి ఫస్ట్ సేల్ ఈరోజు అంటే మార్చి 21న  వచ్చేసింది. పోకో ఎక్స్5 5జిని భారతదేశంలో గత వారం ప్రవేశపెట్టారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో వస్తుంది. 8జి‌బి వరకు ర్యామ్, 256జి‌బి వరకు స్టోరేజ్ దీనిలో ఉంది. ఈ ఫోన్‌పై ఉన్న ఆఫర్‌లు, ఫీచర్ల గురించి తెలుసుకోండి…

పోకో ఎక్స్5 5జి స్పెసిఫికేషన్లు
పోకో ఎక్స్5 5జి అండ్రాయిడ్ 12 ఆధారిత MIUI 13ని పొందుతుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ ఆమోలెడ్ స్క్రీన్‌, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో 8జి‌బి ర్యామ్, 256జి‌బి వరకు స్టోరేజ్ ఉంది.

Latest Videos

 కెమెరా
పోకో ఎక్స్5 5జిలో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్‌, రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్,  మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్, ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ
కనెక్టివిటీ కోసం ఫోన్‌లో బ్లూటూత్ 5.1, Wi-Fi, జి‌పి‌ఎస్, ఎన్‌ఎఫ్‌సి, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ ఉంది. ఫోన్ మొత్తం బరువు 189 గ్రాములు.

 ధర
6జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్‌ ధర రూ. 19,999, 8జి‌బి ర్యామ్ తో 256జి‌బి స్టోరేజ్ ధర రూ. 20,999, అయితే ఫస్ట్ సేల్‌లో బ్యాంక్ ఆఫర్‌తో 6జి‌బి వేరియంట్ రూ. 16,999కి, 8జి‌బి మోడల్ ని రూ. 18,999 ధరతో కొనవచ్చు. Poco X5 5Gని ఫ్లిప్‌కార్ట్ నుండి సూపర్‌నోవా గ్రీన్, వైల్డ్‌క్యాట్ బ్లూ, జాగ్వార్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది.

vuukle one pixel image
click me!