ఇంత అద్మానమ సీఈఓ? సలీల్ పరేఖ్‌పై మరో ప్రజావేగు

By Sandra Ashok Kumar  |  First Published Nov 13, 2019, 10:45 AM IST

తాజాగా మరో ప్రజా వేగు (విజిల్‌బ్లోయర్‌) ఆయనపై కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు ఫిర్యాదు చేశారు. పరేఖ్‌ అధికార దుర్వినియోగంతో సంస్థ పరువు పోతోందని వెంటనే ఆయనను తొలగించాలన్నారు.


బెంగుళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌పై ఆరోపణల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ప్రజా వేగు (విజిల్‌బ్లోయర్‌) ఆయనపై కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు ఫిర్యాదు చేశారు. పరేఖ్‌ అధికార దుర్వినియోగంతో సంస్థ పరువు పోతోందని వెంటనే ఆయనను తొలగించాలన్నారు. 

ఆయన బెంగళూరుకు మారని పక్షంలో ఖర్చులన్నీ సీఈవో జీతం నుంచే రాబట్టాలని కోరారు. చైర్మన్, స్వతంత్ర డైరెక్టర్లు, నామినేషన్‌ అండ్‌ రెమ్యూనరేషన్‌ కమిటీని (ఎన్‌ఆర్‌సీ) సంబోధిస్తూ ప్రజావేగు ఈ ఫిర్యాదు పంపారు.

Latest Videos

undefined

aslo read  యూట్యూబ్ చూసేవారికి బ్యాడ్ న్యూస్....ఏంటంటే...

‘నేను ఇన్ఫీ ఫైనాన్షియల్‌ విభాగంలో ఉద్యోగిని. విషయ తీవ్రత దృష్ట్యా కక్ష సాధింపు చర్యలు ఉంటాయనే భయంతో పేరు వెల్లడించలేకపోతున్నా. నేను కూడా సంస్థలో వాటాదారునే. సలీల్‌ పరేఖ్‌ తీరుతో కంపెనీ ప్రతిష్ట, విలువలు దిగజారిపోతున్న సంగతిని యాజమాన్యం దృష్టికి తేవాలనే ఉద్దేశంతోనే ఉద్యోగులు, వాటా దారుల తరఫున నేను ఈ లేఖ రాస్తున్నా’ అని ఆ ప్రజావేగు పేర్కొన్నారు. 

ఈ అంశంపై తగు చర్యలు తీసుకోవాలని.. సంస్థపై ఉద్యోగులు, షేర్‌హోల్డర్లు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడాలని ఇన్ఫోసిస్ యాజమాన్యాన్ని అభ్యర్థించారు. ‘నియామక ఒప్పందం ప్రకారం పరేఖ్‌ బెంగుళూరు నుంచే పని చేయాలి.

సీఈఓగా బాధ్యతలు స్వీకరించి 20 నెలలైనా ఆయన ఇంకా ముంబై నుంచే బాధ్యతలు నిర్వహిస్తూ నెలకు రెండు సార్లు మాత్రమే బెంగుళూరు వస్తున్న విషయాన్ని ప్రజా వేగు గుర్తు చేశారు. 

ప్రతి నెలా నాలుగు బిజినెస్‌ క్లాస్‌ టికెట్లు, రెండు చోట్ల విమానాశ్రయాలకు డ్రాపింగ్, పికప్‌ వంటి ఖర్చులు ఉంటున్నాయి. ఇలా రూ.22 లక్షల దాకా ఖర్చయ్యింది. ఈ ఖర్చులను ఆయన దగ్గర్నుంచే రాబట్టాలి. అసలు.. ఆయన బెంగళూరులోనే ఉండాలని కంపెనీ బోర్డు ఎందుకు గట్టిగా చెప్పడం లేదు’ అని ప్రజావేగు తన ఫిర్యాదులో ప్రశ్నించారు.

పైపెచ్చు బోర్డును, వ్యవస్థాపకులను తప్పుదోవ పట్టించేందుకు పరేఖ్‌.. బెంగళూరులో అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నట్లు చూపుతున్నారని అన్నారు. ఇప్పటిదాకా ఇంత అధ్వానంగా వ్యవహరించే సీఈవోను చూడలేదన్నారు.

ముంబైలోని కొన్ని చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినందు వల్లే వాటి  పర్యవేక్షణకే సలీల్ పరేఖ్ ముంబై వదిలి పెట్టడం లేదని సదరు ప్రజా వేగు ఆరోపించారు. అమెరికా వెళ్లినా ఇన్ఫోసిస్‌ ఆఫీసులకు, క్లయింట్ల ఆఫీసులకు పరేఖ్‌ వెళ్లరన్నారు. ఇన్ఫోసిస్‌ నుంచి నిధులు ఇప్పిస్తానని అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలకు వాగ్దానాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

aslo read  లక్ష్యం దిశగా బీఎస్ఎన్ఎల్.. వీఆర్ఎస్ @ 75 వేలు

తద్వారా ఈ యూనివర్సిటీల్లో తన పిల్లలకు ప్రవేశాలు పొందాలని సలీల్ పరేఖ్ యోచిస్తున్నారని సదరు ప్రజా వేగు పేర్కొన్నారు. మిగతా ఉద్యోగులు ఏటా జూలై/ఆగస్టులో బోనస్‌ అందుకుంటుంటే పరేఖ్ మాత్రం ఏప్రిల్‌లోనే బోనస్‌ అందుకుంటున్నారని తెలిపారు.

తన అమెరికా గ్రీన్‌కార్డ్‌ హోదాను కాపాడుకునేందుకు పరేఖ్‌ ప్రతి నెలా అమెరికా వెళ్లి వస్తున్నట్టు వస్తున్న ఆరోపణలపైనా దర్యాప్తు చేయాలని కోరారు. కంపెనీ స్వల్ప కాలిక రాబడులను ఎక్కువగా చూపేందుకు సీఈఓ పరేఖ్‌, సీఎఫ్ఓ నిరంజన్‌ రాయ్‌ లెక్కలు తారుమారు చేస్తున్నట్టు కొద్ది రోజుల క్రితం కంపెనీకే చెందిన గుర్తు తెలియని ఒక ఉద్యోగి రాసిన లేఖపైనా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.

click me!