బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల్లో వీఆర్ఎస్ పథకం ఫుల్ స్వింగ్‌లో ఉంది. మంగళవారం మధ్యాహ్నం వరకు 75 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని ఒక ఆంగ్ల దినపత్రిక వార్తాకథనం ప్రచురించింది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌ల్లో వీఆర్ఎస్ పథకానికి ఉద్యోగుల నుంచి జోరుగా స్పందన లభిస్తోంది. 70 వేల మందికి పైగా వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) పీకే పూర్వార్ తెలిపారు.
ఒక ఆంగ్ల దినపత్రిక తెలిపిన వివరాల మేరకు మంగళవారం మధ్యాహ్నానికి వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 75 వేల మందికి చేరుకున్నది. మొత్తం 1.50లక్షల ఉద్యోగుల్లో లక్షమంది వరకూ వీఆర్‌ఎస్‌కు అర్హులు.
undefined
aslo read ఫుజిఫిల్మ్ నుంచి మిర్రర్‌లెస్ కెమెరా లాంచ్...దీని ధర....
బీఎస్ఎన్ఎల్‌తోపాటు ఎంటీఎన్ఎల్ సంస్థతో కలిసి దాదాపు 1.10 లక్షల మంది వరకు వీఆర్‌ఎస్ కింద పంపాలని రెండు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇటీవల ప్రకటించిన ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది.‘వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 70వేలకు చేరింది. ఉద్యోగుల నుంచి విశేష స్పందన వస్తోంది’ బీఎస్ఎన్ఎల్ చైర్మన్ పీకే పూర్వార్ తెలిపారు.
మరోపక్క ఉద్యోగులను వీఆర్‌ఎస్ కింద పంపిస్తే రోజువారీ వ్యాపార కార్యకలాపాలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని బీఎస్‌ఎన్‌ఎల్ యాజమాన్యాన్ని టెలికాం విభాగం అప్రమత్తం చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని టెలిఫోన్ ఎక్స్ఛేంజీల్లో అంతరాయాలు ఏర్పడకుండా చూడాలని నిర్దేశించింది.
aslo read ‘స్మార్ట్ ఫోన్ల’కు గిరాకీ ఫుల్: కలిసొచ్చిన ఆన్‌లైన్ ఆఫర్లు...
2020 జనవరి 31వ తేదీ నాటికి 50 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయస్సు కలిగిన బీఎస్‌ఎన్‌ఎల్ శాశ్వత, రెగ్యులర్ ఉద్యోగులు.. డిప్యుటేషన్‌పై వేరే సంస్థలకు వెళ్లినవారు కూడా వీఆర్ఎస్ పథకానికి అర్హులుగా ఉన్నారు. సర్వీస్ పూర్తి చేసిన కాలానికి ఏడాదికి 35 రోజుల చొప్పున, ఇంకా ఉన్న పదవీ కాలానికి సంబంధించి ఏడాదికి 25 రోజుల చొప్పున ఎక్స్‌గ్రేషియా లెక్కించి పరిహారం చెల్లిస్తారు.