సెర్చింజన్ లేకుండానే విపణిలోకి హువావే ‘మేట్ ఎక్స్’

By narsimha lode  |  First Published Nov 17, 2019, 2:02 PM IST

ప్రముఖ చైనా స్మార్ట్​ ఫోన్​ తయారీ సంస్థ హువావే గూగుల్ యాప్​లు లేకుండానే తొలి స్మార్ట్​ ఫోన్​ విడుదల చేసింది. 


న్యూఢిల్లీ: ప్రముఖ చైనా స్మార్ట్​ ఫోన్​ తయారీ సంస్థ హువావే గూగుల్ యాప్​లు లేకుండానే తొలి స్మార్ట్​ ఫోన్​ విడుదల చేసింది. ఆ సంస్థపై అమెరికా విధించిన నిషేధం తాత్కాలికంగా సడలించిన నేపథ్యంలో గూగుల్ యాప్​లు లేకుండా ఈ కొత్త స్మార్ట్​ ఫోన్ తేవడం ఆసక్తికర పరిణామం. హువావే నుంచి వస్తున్న తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇదే కూడా.

కొత్త స్మార్ట్​ ఫోన్ మేట్‌ ఎక్స్‌ 8 అంగుళాల (అన్ ఫోల్డబుల్) ఫోల్డబుల్‌ డిస్‌ప్లేతో వస్తోంది. దీని ధరను 16,999 యువాన్లు(2,422డాలర్లు)గా నిర్ణయించింది. దక్షిణ కొరియా మేజర్ శామ్‌సంగ్‌ గెలాక్సీ ఫోల్డ్‌ మోడల్​కు పోటీగా ఈ ఫోన్​ను అందుబాటులోకి తెచ్చింది హువావే. 

Latest Videos

undefined

దీనిలో క్వాల్కమ్‌కు బదులుగా కిరిన్‌ 980, బ్యాలాంగ్‌ 5000 చిప్‌సెట్‌లను వాడింది. ఆండ్రాయిడ్‌తోపాటు, ఈఎంయూఐ9తో పనిచేసే ఈ ఫోన్‌లో కేవలం చైనాకు చెందిన యాప్స్‌ మాత్రమే ఉంటాయి. గూగుల్ మ్యూజిక్ సహా గూగుల్ ప్లే స్టోర్ లోని యాప్స్‌ ఇందులో ఉండవు. మరి వినియోగదారుల నుంచి దీనికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

అమెరికాలో హువావే ఉత్పత్తులను విక్రయించుకోవచ్చని అధికారులు వెల్లడించినా, ఇంకా అనుమతులు లభించని కారణంగా ఎదురు చూపులు తప్పడం లేదు. ప్రస్తుతం చైనాలో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను త్వరలోనే ఇతర దేశాల్లోనూ విక్రయించాలని హువావే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 
 

click me!