హైక్ మేసెంజర్ లో కొత్త ఫీచర్

By Sandra Ashok KumarFirst Published Nov 16, 2019, 4:26 PM IST
Highlights

హైక్ యూజర్లు తమ సొంత హైక్‌మోజీని సృష్టించుకోవచ్చు. హైక్ స్టిక్కర్ చాట్ యాప్ లో  ప్రత్యేకమైన హైక్‌మోజి స్టిక్కర్‌లను యాక్సెస్ చేయవచ్చు ఇంకా దీనిని ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కూడా షేర్ చేయవచ్చు.

ఇండియన్ యునికార్న్ హైక్ ఈ రోజు ‘హైక్ మోజి’ ను ప్రారంభించింది. ఇది వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై వినియోగదారుల భావోద్వేగాలను వ్యక్తపర్చడానికి అవతారాలను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ వెయ్యి రకాల హెయిర్ స్టైల్స్, ముఖ లక్షణాలు, బిండిస్, స్థానిక దుస్తులు, నోస్ పిన్స్ ఇంకా మరెన్నో ఉన్నాయని  హైక్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

also read  బాక్టీరియాని చంపే బల్బ్...ఎలా పనిచేస్తుందంటే... ?

హైక్ యొక్క స్టిక్కర్ చాట్ యాప్ పై సెల్ఫీని క్లిక్ చేయడం ద్వారా, అధునాతన కంప్యూటర్ విజన్ మరియు లోతైన న్యూరల్ నెట్‌వర్క్‌లు వినియోగదారుకు బాగా సరిపోయే అవతార్‌ను రూపొందించడంలో సహాయపడతాయి. అప్పుడు వినియోగదారుడు వారి స్వంత ఆలోచనలకు అనుగుణంగా, నచ్చిన విధంగా,  హెయిర్ స్టయిల్, నోస్ పిన్స్ మొదలైన స్టిక్కర్ లను  అనుకూలంగా వాడుకొవాడానికి సహాయపడుతుంది.
 
ప్రత్యేకమైన హైక్ మోజి స్టిక్కర్లు వారి అవతార్ మరియు భాషా ఎంపిక ఆధారంగా వినియోగదారుడికి అందుబాటులో ఉన్నాయి. ఇవి ఇంగ్లీష్ & హిందీతో పాటు 7 ప్రాంతీయ భాషలలో లభిస్తాయి. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సులువుగా పంచుకోవచ్చు.

also read ట్విట్టర్ యూటర్న్: పొలిటికల్ ప్రకటనల నిషేధంపై....

గూగుల్ ప్లే & యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న హైక్ స్టిక్కర్ చాట్ యాప్‌లో యూజర్లు తమ సొంత హైక్‌మోజీని సృష్టించవచ్చు. ప్రత్యేకమైన హైక్‌మోజీ స్టిక్కర్‌లను యాక్సెస్ చేయవచ్చు. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా అప్లికేషన్‌లో అందుబాటులో ఉంది త్వరలో ప్రధాన యాప్ లో అప్ డేట్ అవుతుంది.

click me!