దాదాపు అన్ని ఫోన్లలోనూ ప్రధాన ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ గా ఆల్రెడీ టిక్ టాక్ స్థిరపడిపోయింది. ప్రజలే స్వయంగా తమ వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఈ యాప్‌కి ఎక్కడ లేని క్రేజ్ తెచ్చారు. వారు పాపులర్ కూడా అవ్వాలని ఫీల్ అవుతున్నారు అది వేరే విషయం లేండి.
టిక్ టాక్... ఈ యాప్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఈ టిక్ టాక్ డౌన్లోడ్స్ లో మన దేశం అగ్రస్థానంలో ఉంది. ఈ అప్ పాపులారిటీ ఎంతలా ఉందంటే దీన్ని కథలో ప్రధాన ఇతివృత్తంగా చేసుకొని సినిమా తీసేంత. దీని ప్రభావం ప్రజలపై ఎంతలా ఉందంటే కాపురాలు కూలిపోయేంత.
దాదాపు అన్ని ఫోన్లలోనూ ప్రధాన ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ గా ఆల్రెడీ టిక్ టాక్ స్థిరపడిపోయింది. ప్రజలే స్వయంగా తమ వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఈ యాప్‌కి ఎక్కడ లేని క్రేజ్ తెచ్చారు. వారు పాపులర్ కూడా అవ్వాలని ఫీల్ అవుతున్నారు అది వేరే విషయం లేండి. ఇలా ప్రజలు ఇబ్బడిముబ్బడిగా దీన్ని వాడుతుండడంతో, దీని ద్వారా డబ్బు సంపాదించడం ఎలా అన్న కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. కారణం... ఇప్పుడు ఈ యాప్... వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్ లాంటి ఇతర సామాజిక మాధ్యమాలకు గట్టి పోటీ ఇస్తోంది.
undefined
also read వొడాఫోన్ నుండి 4 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు
తక్కువ వ్యవధిలో సెకండ్లలో పూర్తయ్యే వీడియోలను చూసేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. రకరకాల కంటెంట్ లభిస్తుండడంతో ప్రజలు విపరీతంగా చూస్తున్నారు. ప్రజలు విపరీతంగా చూస్తుండడంతో చాలామంది కూడా వీడియోలను తాయారు చేసి పోస్టులు చేస్తున్నారు. ఇంకేముంది ఈ యాప్ వాడకం ఎక్కువైపోయింది.
ఇక దీనిలోనూ డబ్బు సంపాదించే యాంగిల్ మొదలవడంతో డబ్బు సంపాదించడానికి ఇదే సరైన సమయం అని భావించిన చాలామందిఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టి సక్సెస్ కూడా పొందారు. ఇక డబ్బులు ఎలా సంపాదించాలో 6పాయింట్లలో తెలుసుకుందాం.
1. వంట చేయాలంటే పొయ్యి వెలిగించడం ఎలాగో తొలుత మీకు కూడా ఒక ప్రత్యేక టిక్ టాక్ ప్రొఫైల్ ఉండాలి. ఇక ప్రొఫైల్ క్రియేట్ చేయగానే ప్రజలకు నచ్చే కంటెంట్ మీద దృష్టి సారించాలి. ఇలా మంచి ట్రేండింగ్ కంటెంట్ గనుక తాయారు చేస్తే ప్రజలు మీ వీడియోలను ఆసక్తిగా చూస్తారు. ఇక ఆ క్రమంలో వ్యూయర్స్ కు నాచే మంచి కంటెంట్ క్రియేట్ చేస్తూ... వీలైనంత ఎక్కువ మంది ఫాలోయర్లను సంపాదించుకోవడం మీ టార్గెట్ అవ్వాలి.
2. కంటెంట్ ఇంటరెస్టింగ్ గా ఉండడం మాత్రమే కాకుండా ట్రెండింగ్ లో ఉన్నవి, వైరల్ అవుతున్న వీడియోస్ ని ఎంచుకోవాలి. వైరల్ గా మారిన పాటలు, కాన్సెప్ట్‌లను ఎంచుకోవాలి. ఇందుకోసం సోషల్ మీడియా లో క్షుణ్ణంగా సర్ఫింగ్ చెయ్యాలి. ఆ ట్రెండింగ్ ఐటమ్స్ కింద ఉన్న కామెంట్స్ ని గనుక చదివితే మీకు ప్రేక్షకుల మూడ్ అర్థమవడంతోపాటు వారు ఎలా ఆలోచిస్తున్నారా ఒక అవగాహనకు కూడా రాగలుగుతారు.
3. మీ ఇతర సామాజిక మాధ్యమాల ఖాతాలని కూడా టిక్ టాక్ కి లింక్ చేయాలి. యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్స్ ను కూడా గనుక మీ టిక్ టాక్ ప్రొఫైల్ లో ఆడ్ చేస్తే మీకు ఫాలోయర్స్, వ్యూయర్స్ పెరుగుతారు.
4. వీడియో క్రియేట్ చేసిన తరువాత అది ఎంతబాగున్నప్పటికీ... దాన్ని గనుక ప్రజలకు చేరువచేయలేకపోతే అది వ్యర్థమవుతుంది. మీ వీడియో ఎను క్కువ మంది ఆడియెన్స్‌కి రీచ్ అయ్యేలా చెయ్యాలి. ఇందుకోసం మీ వీడియోని బాగా షేర్ చేయాల్సి ఉంటుంది.
మీ మిత్రులకి, మీ పేస్ బుక్ అకౌంట్ లో, ఇతరయాత్రల అన్ని చోట్లా పోస్ట్ చేయడం ద్వారా మీరు వీలైనంత ఎక్కువమంది ప్రేక్షకులను చేరుకునే వీలుంటుంది. ఈ దశలో గనుక మీరు విజయం సాధిస్తే, సోషల్ మీడియాలో మీకు ఆర్గానిక్ సెర్చ్ (మీ పేరు టైపు చేసి వెదకడం) పెరుగుతుంది.
also read ఎల్‌జి నుంచి డబల్ స్క్రీన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్...ధర ఎంతో తెలుసా ?
5. ఇక సోషల్ మీడియా లో మాదిరి మన వీడియోస్ కి టాగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఆ విషయం గురించి సెర్చ్ చేయగానే మీ వీడియో కనపడుతుంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌కి ఎలాగైతే హ్యాష్ ట్యాగ్స్ ఇస్తామో, అలాగే టిక్ టాక్ వీడియోలకూ ఇవ్వాలి.
6. మీ ప్రొఫైల్‌కి గనుక చెప్పుకోతగ్గ స్థాయిలో ఫాలోయర్లు (కనీసం 30 వేల మంది) వస్తే ఇక మీరు సంపాదన మొదలుపెట్టినట్టే. మీ ఫాలోయర్స్ బేస్ ని చూపించి వీడియోలపై యాడ్స్ కోసం మీరు బ్రాండ్స్, స్పాన్సర్లను కలిసి మాట్లాడుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే మీకు కావలిసినంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది.
హై రేటింగ్ ఉన్న వీడియోలకు కంపెనీలు కానీ, బ్రాండ్స్ కానీ యాడ్స్ ఇవ్వడానికి మొగ్గు చూపుతాయి. తద్వారా మీకు ఆ సదరు బ్రాండ్స్ కొంత డబ్బు చెల్లిస్తాయి. యూట్యూబ్ లాగా టిక్ టాక్ డైరెక్ట్ గా వీడియోలపై యాడ్స్ వేసి, క్రియేటర్లకు డబ్బులు ఇచ్చే విధానం తేలేదు. త్వరలో తీసుకురానుందని సమాచారం.
ఇక ఫైనల్ గా ఒక బోనస్ టిప్. మీ వీడియోను గనుక సెలెబ్రిటీలకు ఎలాగైనా చేరవేయగలిగితే ఎక్కువ మంది దాన్ని చూస్తారు. అప్పుడు ఎంగేజ్మెంట్ పెరిగి డబ్బులు ఎక్కువ వస్తాయి. మీరు టిక్ టాక్ వీడియోలను కన్సిస్టెంట్ గా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మీకు ఫాలోవర్లు పెరుగుతారు.