ఇండియాలోనే అత్యంత చౌకైన 5జి స్మార్ట్‌ఫోన్.. నేడే ఫస్ట్ సేల్.. ధర, ఫీచర్స్ ఇవే..

By asianet news teluguFirst Published Nov 15, 2022, 1:41 PM IST
Highlights

లావా బ్లేజ్ 5జి ధర రూ. 10,999 అయితే లాంచింగ్ ఆఫర్ కింద రూ. 9,999కి కొనుగోలు చేసే అవకాశం అందిస్తుంది. దీనిని గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ కలర్స్ లో ఫోన్ కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది. 

కంప్యూటర్ హార్డ్ వేర్ కంపెనీ లావా  ఇండియాలో ఈరోజు అంటే నవంబర్ 15న లావా బ్లేజ్ 5జి  ఫస్ట్ సేల్‌ ప్రారంభించింది. లావా బ్లేజ్ 5జి దేశంలోనే అత్యంత చౌకైన 5జి స్మార్ట్‌ఫోన్. లావా బ్లేజ్ 5జి  ఫస్ట్ గ్లింప్స్ ఈ సంవత్సరం ఆగస్టులో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022లో ఆవిష్కరించింది, ఇప్పుడు సుమారు రెండు నెలల తర్వాత లావా బ్లేజ్ 5జి  సేల్స్  మొదలయ్యాయి. లావా బ్లేజ్ 5జిని  అమెజాన్ ఇండియా నుండి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్స్ ఉంటాయి. లావా ఈ ఫోన్ ని ఆఫర్ కింద చౌకగా కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తుంది. లావా బ్లేజ్ 5జి   ఈ సెగ్మెంట్‌లోని మొదటి ఫోన్, దీనిలో మీరు బ్యాక్ గ్రౌండ్ లో యుట్యూబ్ ని ప్లే చేయవచ్చు.

లావా బ్లేజ్ 5జి ధర
లావా బ్లేజ్ 5జి ధర రూ. 10,999 అయితే లాంచింగ్ ఆఫర్ కింద రూ. 9,999కి కొనుగోలు చేసే అవకాశం అందిస్తుంది. దీనిని గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్ కలర్స్ లో ఫోన్ కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది. దీనితో పాటు, జియో నుండి చాలా బెనెఫిట్స్ కూడా ఉంటాయి. ఫోన్‌తో పాటు హోమ్ రిపేర్ సర్వీస్ కూడా  అందిస్తుంది అంటే, మీ ఫోన్ పాడైతే కంపెనీ దానిని మీ ఇంటి నుండి తీసుకెళ్లి రిపేర్ చేసి తరువాత ఇంటికి డెలివరీ చేస్తుంది.

లావా బ్లేజ్ 5జి స్పెసిఫికేషన్లు
లావా బ్లేజ్ 5జి 6.51-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే,  720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌, ఫోన్ డిస్‌ప్లేతో 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఇచ్చారు. లావా బ్లేజ్ 5జి MediaTek Dimensity 700 ప్రాసెసర్‌తో Android 12ని పొందుతుంది. 4జి‌బి ర్యామ్, గరిష్టంగా 3జి‌బి వర్చువల్ ర్యామ్, 128జి‌బి స్టోరేజ్ సపోర్ట్ లభిస్తుంది. వైడ్‌లైన్ L1 ఫోన్‌తో కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ నెట్‌ఫ్లిక్స్ హెచ్‌డి వీడియోలను చూడవచ్చు.

లావా బ్లేజ్ 5జి కెమెరా
ఫోన్‌లో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీనిలో ప్రైమరీ లెన్స్ 50-మెగాపిక్సెల్ ఏ‌ఐ సెన్సార్. ఇది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)తో వస్తుంది. మిగతా రెండు లెన్స్‌ల గురించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

లావా బ్లేజ్ 5జి బ్యాటరీ
ఈ లావా ఫోన్ 5000mAh బ్యాటరీ ఉంది, దీనితో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా లభిస్తుంది. లావా బ్లేజ్ 5జి యూ‌ఎస్‌బి టైప్-సి పోర్ట్‌తో వస్తుంది ఇంకా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఉంది. కనెక్టివిటీ కోసం 8 5G బ్యాండ్‌లు కాకుండా ఫోన్ 4G VoLTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5.1కి సపోర్ట్ చేస్తుంది. 

click me!