హానర్ ఒక కొత్త 5జి స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ 5జి స్మార్ట్ ఫోన్ ని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో తీసుకొచ్చారు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే కెమెరా డిజైన్ క్యాప్సూల్ ఆకారంలో ఉంటుంది.
చైనీస్ మల్టీ నేషనల్ కంపెనీ హువావే సబ్ బ్రాండ్ హానర్ కొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ ఎక్స్20ఎస్‌ఇని విడుదల చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో హానర్ ఎక్స్20ఎస్‌ఇని తీసుకొచ్చారు. ఇందులో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్ ఉంది. కెమెరా డిజైన్ క్యాప్సూల్ ఆకారంలో ఉంటుంది. అంతేకాకుండా ఫోన్ పంచ్‌హోల్ డిస్ ప్లేతో వస్తుంది.
హానర్ ఎక్స్20ఎస్‌ఇ ధర
హానర్ఎక్స్20ఎస్‌ఇ ధర 1,799 చైనీస్ యువాన్ అంటే సుమారు రూ.20,600. ఈ ధర వద్ద 6 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది. 8 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,999 చైనీస్ యువాన్ అంటే సుమారు రూ .22,900. ఈ ఫోన్ మ్యాజిక్ నైట్ బ్లాక్, బ్లూ వాటర్ ఎమరాల్డ్, టైటానియం సిల్వర్, చెర్రీ పింక్ గోల్డ్ సహా నాలుగు రంగులలో వికాయించనున్నరు. దీని సేల్స్ జూన్ 9 నుండి చైనాలో ప్రారంభమవుతుంది. భారత మార్కెట్లో లభ్యతపై ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు.
undefined
also read సెన్సేషనల్ యాప్ టిక్‌టాక్ బ్యాన్ పై నేటికీ ఏడాది.. త్వరలో మళ్ళీ రి-లాంచ్ కానుందా..
స్పెసిఫికేషన్లు
అండ్రాయిడ్ 11 ఆధారంగా మ్యాజిక్ యూఐ 4.1, 1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ టిఎఫ్‌టి ఎల్‌సిడి డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ తో 128 జీబీ వరకు స్టోరేజ్ లభిస్తుంది.
హానర్ ఎక్స్20ఎస్‌ఇ కెమెరా
దీనికి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్ తో ఎపర్చరు f/1.9. రెండవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మైక్రో సెన్సార్ తో ఎపర్చరు f/2.4 ఉంటుంది. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు దీని ఎపర్చరు ఎఫ్/2.0.
హానర్ ఎక్స్20ఎస్‌ఇ బ్యాటరీ
హానర్ ఎక్స్ 20 ఎస్‌ఇలో 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లస్తుంది. కనెక్టివిటీ కోసం ఫోన్‌లో వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ వి5.1, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్ బరువు 179 గ్రాములు.