ఇండియాలో వ్యాపారం చేస్తున్న చాలా మటుకు బడా ఈ–కామర్స్ కంపెనీలు అనేక రకాలుగా, యథేచ్ఛగా దేశ చట్టాలను ఉల్లంఘించాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ వ్యాఖ్యానించారు.
ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇ-కామర్స్ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టడంలో గర్వపడుతున్నాయని, అయితే ఉద్దేశపూర్వకంగా భారత చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని గోయల్ అన్నారు.
ఇ-కామర్స్ కంపెనీలకు దేశ చట్టాలన్ని పూర్తిగా పాటించాల్సి అవసరం ఉంటుందని కేంద్ర మంత్రి కఠినమైన సూచనలు ఇచ్చారు. అర్థబలం.. అంగబలంతో ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించరాదని ఒక సెమినార్‌లో పాల్గొన్న సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. పలు కంపెనీలు పాటిస్తున్న విధానాలు.. వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటున్నాయని ఆయన తెలిపారు. భారతదేశానికి వచ్చిన చాలా పెద్ద ఇ-కామర్స్ కంపెనీలు ఒకటి కంటే ఎక్కువసార్లు దేశ చట్టాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించాయి.
undefined
పెద్ద ఇ-కామర్స్ సంస్థలతో పలు చర్చలు జరిపినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. వీటిలో అమెరికన్ ఇ-కామర్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. అన్ని కంపెనీలు దేశ చట్టాన్ని పాటించాలని కేంద్ర మంత్రి గోయల్ ఈ-కామర్స్ కంపెనీలను హెచ్చరించారు. భారతీయ ప్రయోజనాలను, వినియిగదారులను దెబ్బతీసేందుకు లేదా ఆర్ధిక శక్తిని ఉపయోగించకుండా ఉండండి.
also read
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై లక్ష్యం!
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్‌లకు పేరు పెట్టకుండా వెబ్‌నార్‌లో పియూష్ గోయల్ ఈ కంపెనీల లక్ష్యంగా వ్యాఖ్యానించారు. అయితే ఏ నిబంధనలు ఉల్లంఘించాయో పేర్కొనలేదు, కాని వినియోగదారుల రక్షణ చట్టాలతో సహా యు.ఎస్ కంపెనీలపై చట్టాలు విధించిన.. పెద్ద ఇ-కామర్స్ కంపెనీల వల్ల చిన్న వ్యాపారాల మధ్య కలిగే గందరగోళం మధ్య ఆయన ప్రకటన వచ్చింది.
కంపెనీలు అనుసరిస్తున్న పద్ధతులు వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధమని, ఇ-కామర్స్ కంపెనీలు లేదా మార్కెట్ ప్లేస్ మోడల్ కోసం ప్రభుత్వం ఇటీవల ముసాయిదా నిబంధనలను తీసుకువచ్చిందని, ఇది భారతీయ సంస్థలతో సహా అన్ని సంస్థలకు వర్తిస్తుందని ఆయన అన్నారు. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఈ నియమాలు అమలులో ఉండనున్నాయి.