చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ తాజాగా విపణిలోకి వినూత్న, శక్తిమంతమైన డ్యూయల్ మోడ్ 5జీలో వ్యూ 30, వ్యూ 30 ప్రో ఫోన్లను ఆవిష్కరించింది. వ్యూ 30 సిరీస్‌లో తొలి డ్యూయల్ మోడ్ 5జీ స్మార్ట్‌ఫోన‍్లను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది.
బీజింగ్: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ శక్తిమంతమైన స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. వ్యూ 30 సిరీస్‌లో తొలి డ్యూయల్ మోడ్ 5జీ స్మార్ట్‌ఫోన‍్లను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. వ్యూ 30, వ్యూ 30 ప్రో పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌లలో 5జీ/4జీ 4 జి డ్యూయల్ మోడ్‌ను అమర్చింది. అందుబాటులో ఉన్న నెట్‌వర్క్ ఆధారంగా యూజర్లు 4జీ/5జీ నెట్‌వర్క్‌కు మారవచ్చని కంపెనీ తెలిపింది.
also read 2020 నుంచి కస్టమర్లకు అప్పులివ్వనున్న ట్రూకాలర్ యాప్
తమ హానర్ వ్యూ 30 సిరీస్ ఇప్పటి వరకు అత్యంత వినూత్నమైన స్మార్ట్‌ఫోన్లనీ, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజల రోజువారీ జీవితాలపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుందని హానర్ ప్రెసిడెంట్ జార్జ్ జావో పేర్కొన్నారు.
వ్యూ 30 ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ విత్ 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా 3,299 యువాన్లు (సుమారు రూ. 33,600). 3699 యువాన్లు ( సుమారు రూ. 37,700)గా నిర్ణయించింది. ఇక వ్యూ 30 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 3,899 యువాన్లు (సుమారు రూ.39,700), 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ 4,199 యువాన్లు (సుమారు రూ. 42,800)లకు లభిస్తాయి.
వ్యూ 30 ప్రో ఫోన్‌లో 6.57-అంగుళాల ఎఫ్‌హెచ్డీ ప్లస్ ఫుల్‌వ్యూ డిస్‌ప్లేతోపాటు 7ఎన్ఎం ప్రాసెస్-బేస్డ్ కిరిన్ 990 చిప్‌సెట్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌పై పని చేస్తుంది. 40+12+8 ఎంపీ ట్రిపుల్ రియల్ కెమెరాతోపాటు 32 +8 ఎంపీ సెల్ఫీకెమెరా ఉన్నాయి. ఇందులో 4100 ఎంఏహెచ్ శక్తి గల బ్యాటరీ చేర్చారు.
also read ఇండియాలో ఐఫోన్...తయారీ, విక్రయాలు ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలుసా...?
వ్యూ 30 ప్రో డ్యూయల్ పంచ్ హోల్, 40వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 27 వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. మరోవైపు, వ్యూ 30 దాదాపు ఇలాంటి ఫీచర్లతోనే డ్యుయల్ కెమరాల్లో 8ఎంపీ సూపర్ వైడ్ యాంగిల్ సెన్సార్ సెల్ఫీ కెమెరా, 4,200 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో ఆవిష్కరించింది. వీటితోపాటు, మ్యాజిక్‌బుక్14 , మ్యాజిక్‌బుక్15 పేరుతో సరికొత్త మ్యాజిక్‌బుక్ సిరీస్‌ను హానర్ ఆవిష్కరించింది.