ఆండ్రాయిడ్ డెవలపర్‌లు ప్రతి సంవత్సరం వేలకొద్దీ యాప్‌లు, గేమ్‌లను గూగుల్ ప్లే స్టోర్ కి అందిస్తారు తర్వాత గూగుల్ సంవత్సరం చివరిలో ఈ యాప్‌ల నుండి బెస్ట్ యాప్ అండ్ బెస్ట్ గేమ్ విజేతలను ప్రకటిస్తుంది.
ఈ ఏడాది 2022 సంవత్సరానికి గూగుల్ బెస్ట్ అండ్రాయిడ్ యాప్స్ అండ్ బెస్ట్ అండ్రాయిడ్ మొబైల్ గేమ్స్ లిట్స్ ను విడుదల చేసింది. అయితే గూగుల్ 2022 ఏడాదికి క్వెస్ట్‌ని బెస్ట్ ఆండ్రాయిడ్ యాప్‌గా, అలాగే అపెక్స్ లెజెండ్స్ మొబైల్ గేమ్ 2022ని బెస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్ గేమ్‌గా సెలెక్ట్ చేసింది. ఆండ్రాయిడ్ డెవలపర్‌లు ప్రతి సంవత్సరం వేలకొద్దీ యాప్‌లు, గేమ్‌లను గూగుల్ ప్లే స్టోర్ కి అందిస్తారు తర్వాత గూగుల్ సంవత్సరం చివరిలో ఈ యాప్‌ల నుండి బెస్ట్ యాప్ అండ్ బెస్ట్ గేమ్ విజేతలను ప్రకటిస్తుంది.
బిజిఎంఐకి రీప్లేస్ గా అపెక్స్
అపెక్స్ లెజెండ్స్ మొబైల్ గేమ్ గూగుల్ బెస్ట్ అండ్రాయిడ్ మొబైల్ గేమ్‌ల లిస్ట్ లో పోటీగా ఉన్న BGMIని అధిగమించింది. గత సంవత్సరం BGMI బెస్ట్ అండ్రాయిడ్ మొబైల్ గేమ్‌గా సెలెక్ట్ చేయబడింది. ఇప్పుడు అపెక్స్ లెజెండ్స్ మొబైల్ గేమ్ బెస్ట్ గేమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.
undefined
ఈ యాప్‌లకు కూడా అవార్డు
గూగుల్ విడుదల చేసిన అవార్డుల లిస్ట్ లో ఈ-కామర్స్ కేటగిరీ యాప్స్ కూడా చేర్చబడ్డాయి. ఫ్లిప్ కర్ట్ యొక్క షాప్సి యాప్ ఈ సంవత్సరం యూజర్ ఛాయిస్ యాప్ కింద బెస్ట్ యాప్‌గా ఎంపికైంది. యాంగ్రీ బర్డ్స్ జర్నీ బెస్ట్ యూజర్ ఛాయిస్ గేమ్‌గా అవార్డును అందుకుంది. అలాగే నీంద్ , బంకర్ ఫిట్ , డ్యాన్స్ వర్కౌట్ కూడా బెస్ట్ హెల్త్ యాప్‌గా ఎంపికయ్యాయి. ఎంటర్టైన్మెంట్ కోసం బెస్ట్ యాప్స్ విభాగంలో టర్నిప్ సెలెక్ట్ చేయబడింది. పర్సనల్ గ్రోత్ బెస్ట్ యాప్‌గా గూగుల్ ఈ-లెర్నింగ్ యాప్ ఫిలోను సెలెక్ట్ చేసింది.
కరోనా మహమ్మారి తర్వాత కొత్త శకం - గూగుల్
విజేతల లిస్ట్ విడుదల చేస్తూ 2022 సంవత్సరం భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి కరోనా మహమ్మారి యుగాన్ని మార్చిందని గూగుల్ తెలిపింది. 2022లో ప్రజలు విభిన్న అవసరాలకు డిజిటల్ సొల్యూషన్స్‌పై ఆధారపడటం కొనసాగిస్తూనే, బయటి ప్రపంచంలోని అవకాశాలు ఇంకా అనుభవాలకు మరోసారి తెరతీసారు. మేము ప్రతి సంవత్సరంలో బెస్ట్ యాప్స్ అండ్ గేమ్స్ ప్రకటిస్తున్నాము అని గూగుల్ తెలిపింది. మా ఆన్యువల్ అవార్డులు బెస్ట్ యాప్స్ అండ్ గేమ్స్ ఇంకా వాటికి జీవం పోసే డెవలపర్‌లను గుర్తించడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ సంవత్సరం విజేతలకు ఇంకా మా మొత్తం గూగుల్ డెవలపర్ కమ్యూనిటీకి అభినందనలు అని తెలిపింది.