మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా..? ఈ విధంగా బ్యాటరీ లైఫ్ చెక్ చేయండి

By asianet news telugu  |  First Published Nov 15, 2022, 10:09 AM IST

కరోనా వ్యాప్తి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ స్టడీస్ కోసం ల్యాప్‌టాప్‌లను చాలా మంది ఉపయోగించడం ప్రారంభించారు. కొత్త ల్యాప్‌టాప్‌లో బ్యాటరీ లైఫ్ సమస్య ఉండనప్పటికి కొద్దిగా పాతబడిన తరువాత బ్యాటరీ బ్యాకప్ ఇంతకుముందుల ఉండకపోవచ్చు  లేదా ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవ్వడం ప్రారంభమవుతుంది. 


బిజినెస్, ఎడ్యుకేషన్ అండ్ ఆఫీసు పనుల కోసం ఎక్కువగా ల్యాప్‌టాప్‌లను ఉపయోగిస్తుంటాము. కరోనా వ్యాప్తి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ స్టడీస్ కోసం ల్యాప్‌టాప్‌లను చాలా మంది ఉపయోగించడం ప్రారంభించారు. కొత్త ల్యాప్‌టాప్‌లో బ్యాటరీ లైఫ్ సమస్య ఉండనప్పటికి కొద్దిగా పాతబడిన తరువాత బ్యాటరీ బ్యాకప్ ఇంతకుముందుల ఉండకపోవచ్చు  లేదా ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవ్వడం ప్రారంభం కావొచ్చు. మీరు కూడా ల్యాప్‌టాప్  బ్యాటరీ లైఫ్ గురించి ఇబ్బంది పడుతుంటే అలాగే బ్యాటరీ లైఫ్ చెక్ చేయాలనుకుంటే ఇలా తెలుసుకోండి. విండోస్ ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ చెక్ చేయడానికి  ఈజీ మార్గం తెలుసుకొండి..

మీరు Windows 10 ల్యాప్‌టాప్‌ని ఉపయోగిస్తే మీరు మీ ల్యాప్‌టాప్‌లో కమాండ్ ప్రాంప్ట్‌ను లాంచ్ చేయాలి. మీరు కమాండ్ ప్రాంప్ట్ కోసం స్టార్ట్ మెనులో లేదా  Windows సెర్చ్ లో 'cmd' లేదా 'కమాండ్ ప్రాంప్ట్' అని సెర్చ్ చేయవచ్చు. తర్వాత మీరు  ఫైల్ పాత్ (C:\)తో బ్లాక్ లేదా ఏదైనా ఇతర కలర్ విండోను చూస్తారు. 

Latest Videos

undefined

ఇప్పుడు మీరు ఇక్కడ powercfg/batteryreport అనే టెక్స్ట్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు సేవ్ చేసిన బ్యాటరీ లైఫ్ రిపోర్ట్  మెసేజ్ మీ ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై చూపిస్తుంది. ఈ రిపోర్ట్ తో పాటు ఫైల్ పాత్ కూడా చూపిస్తుంది. మీరు ఇక్కడ బ్యాటరీ రిపోర్ట్ యాక్సెస్ చేయలేకపోతే, మీరు యూజర్ ఫోల్డర్‌లో C:\Users\[Your_User_Name]\battery-report.html అనే ఫైల్ కోసం కూడా సెర్చ్ చేయవచ్చు.

ఇప్పుడు మీరు ఫైల్ ఎక్స్‌ప్లోరర్ నుండి ఈ ఫోల్డర్‌ను ఓపెన్ చేయవచ్చు  లేదా మీరు ఫైల్ పాత్‌ను కాపీ చేయవచ్చు. ఈ రిపోర్ట్ లో బ్యాటరీ లైఫ్ గ్రాఫిక్స్ ద్వారా సూచించబడుతుంది. ఈ రిపోర్ట్ బ్యాటరీ పూర్తి సామర్థ్యం, ప్రస్తుత సామర్థ్యం గురించిన సమాచారం ఉంటుంది.

దీనితో పాటు బ్యాటరీ అండ్ డివైజ్ యుసెజ్ గురించి సమాచారం కూడా రిపోర్ట్  లో  ఉంటుంది. మీరు ఈ సమాచారాన్ని AC ఛార్జర్‌లో చూడవచ్చు. ఈ డేటాను పోల్చడం ద్వారా, మీరు ల్యాప్‌టాప్ బ్యాటరీ డ్రైన్ అండ్ హెల్త్ గురించి సమాచారాన్ని పొందవచ్చు.

click me!