Realme Narzo 50 Pro 5G: రియల్‌మీ 5G ఫోన్ ఫస్ట్ సేల్.. భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్..!

By team telugu  |  First Published Jun 10, 2022, 4:04 PM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ నార్జో సిరీస్ 50 5G ఫోన్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో నేటి నుంచి ఫస్ట్ సేల్ ప్రారంభం అవుతుంది.
 



ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ నార్జో సిరీస్ 50 5G ఫోన్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో శుక్ర‌వారం నుంచి ఫస్ట్ సేల్ ప్రారంభం అవుతుంది. MediaTek డైమెన్సిటీ చిప్‌సెట్, AMOLED డిస్‌ప్లే, 48MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చింది. రియల్‌మే సరికొత్త 5G ఫోన్.. Narzo 50 Pro 5G స్పెసిఫికేషన్‌లు వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ డిజైన్ కూడా కస్టమర్‌లను ఆకర్షించేలా ఉంది. Narzo 50 Pro 5G బేస్ వేరియంట్ ధర రూ. 21,999గా ఉంది. HDFC బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా EMI లావాదేవీల ద్వారా Narzo 50 Pro 5Gపై రూ. 2,000 తగ్గింపు అందిస్తోంది. Narzo 50 Pro 5G ధర రూ.19,999లకే సొంతం చేసుకోవచ్చు.

ఆఫర్లు, ధర ఎంతంటే..?

Latest Videos

రియల్‌మీ Narzo 50 Pro 5G రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో 6GB RAM ధర రూ. 21,999, 8GB RAM ధర రూ. 23,999. ఒక్కో వేరియంట్‌పై రూ. 2,000 ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. వరుసగా రూ. 19,999, రూ. 21,999కే సొంతం చేసుకోవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లేదా EMI ఆప్షన్ ద్వారా చేసిన పేమెంట్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు Realme వెబ్‌సైట్, Amazonలో లేదా మీ దగ్గరలోని రిటైల్ షాపుల్లోనూ అందుబాటులో ఉంటుంది.

Realme Narzo 50 Pro 5G స్పెసిఫికేషన్స్

రియల్‌మీ Narzo 50 Pro 5G నార్జో 50 సిరీస్‌లో అత్యంత ఖరీదైన ఫోన్. 90Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.4-అంగుళాల FullHD AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే ఎంబెడెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వస్తుంది. గరిష్టంగా 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 920 ప్రాసెసర్ ద్వారా పొందవచ్చు. ఎక్కువ ర్యామ్ కావాలంటే.. మీరు డైనమిక్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ ఫీచర్‌ని ఉపయోగించి 5GB అదనంగా పొందవచ్చు. మీరు స్టోరేజీని పెంచాలంటే.. మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది.

ఈ ఫోన్ Android 12-ఆధారిత Realme UI 3.0 రన్ అవుతుంది. రియల్‌మీ Narzo 50 Pro 5G వెనుక ఉన్న 3 కెమెరాలలో 48-MP మెయిన్ సెన్సార్, అల్ట్రావైడ్ సెన్సార్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం.. మీరు డిస్‌ప్లే ఎడమవైపు పంచ్-హోల్ లోపల 16-MP కెమెరాను అందించారు. రియల్‌మీ Narzo 50 Pro 5G 5000mAh బ్యాటరీతో 33W స్పీడ్ ఛార్జింగ్ అవుతుంది.
 

click me!