ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ఎప్పుడు చూడని భారీ డిస్కౌంట్ ఆఫర్..

Published : Sep 07, 2022, 02:45 PM IST
 ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ఎప్పుడు చూడని భారీ డిస్కౌంట్ ఆఫర్..

సారాంశం

ఫ్లిప్‌కార్ట్  ఈ సేల్‌లో  రియల్ మీ, పోకో, వివో, స్యామ్సంగ్ తో పాటు ఐఫోన్లను  కూడా భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్‌పై 80 శాతం వరకు తగ్గింపు కూడా ఉంటుంది. 

ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్  బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022ని ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్‌లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది. సేల్ లో ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్‌లతో చేసే కొనుగోళ్లపై 10 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా ఇస్తుంది. సేల్‌లో తగ్గింపుతో పాటు మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా చూడవచ్చు. ఈ సేల్‌లో ఏ ఉత్పత్తులు, కంపెనీలు ఎక్కువ బెనెఫిట్స్ అందిస్తున్నాయో చూద్దాం...

ఫ్లిప్‌కార్ట్  ఈ సేల్‌లో  రియల్ మీ, పోకో, వివో, స్యామ్సంగ్ తో పాటు ఐఫోన్లను  కూడా భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్‌పై 80 శాతం వరకు తగ్గింపు కూడా ఉంటుంది. ఈ సేల్‌లో బెస్ట్ సెల్లింగ్ ట్రిమ్మర్‌లపై 75 శాతం తగ్గింపు, గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై 40 శాతం తగ్గింపుతో పాటు ప్రింటర్లు, మానిటర్లు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే టాప్ సెల్లింగ్ బ్రాండ్‌ల టీవీలను రూ.8,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మొబైల్ కేసులు, స్క్రీన్ గార్డ్‌లను కేవలం రూ.99 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

ఇన్ఫినిక్స్ టీవీ, ల్యాప్‌టాప్, మొబైల్ అలాగే యాక్సెసరీస్‌పై బంపర్ డిస్కౌంట్ సేల్‌ కూడా ఇస్తుంది, అలాగే భారీ తగ్గింపులను కూడా చూడవచ్చు. దీనితో పాటు కంపెనీ బజాజ్ ఫిన్‌సర్వ్, ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్‌తో నో-కాస్ట్ ఈ‌ఎం‌ఐ సౌకర్యాన్ని కూడా అందించబోతోంది. కంపెనీ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌పై రూ. 250 ఇన్స్టంట్ తగ్గింపు ఉంటుంది. దీనితో పాటు కస్టమర్లు 3 లక్షల వరకు స్మార్ట్‌ఫోన్‌లను గెలుచుకునే అవకాశాన్ని కూడా పొందుతారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Snake Alert App : ప్రమాదకర పాముల జాడను గుర్తించే యాప్.. ఇది మొబైల్ ఉంటే మీరు సేఫ్
Samsung Galaxy M47 5G : భీభత్సమైన బ్యాటరీ, సూపర్ స్పీడ్ ప్రాసెసర్‌తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎం 47 5జీ