ఆపిల్‌కు గట్టి దెబ్బ: ఛార్జర్ లేకుండా ఐఫోన్ సేల్స్ పై నిషేధం.. నేడే ఐఫోన్ 14 లాంచ్

By asianet news telugu  |  First Published Sep 7, 2022, 11:50 AM IST

కస్టమర్లకు ఉత్పత్తిని పూర్తిగా అందించడం లేదని ప్రభుత్వం  ఒక ఉత్తర్వుల్లో పేర్కొంది. నేడు అంటే సెప్టెంబర్ 7న ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ జరగబోతోంది.  లాంచ్ ముందు వచ్చిన ప్రభుత్వ నిర్ణయం ఆపిల్‌కు సమస్యగా మారవచ్చని తెలుస్తుంది, ఎందుకంటే కొత్త ఐఫోన్‌ సిరీస్లను కూడా ఛార్జర్ లేకుండా ప్రవేశపెట్టనుంది.


టెక్నాలజి కంపెనీ ఆపిల్‌ ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ కాకముందే బ్రెజిల్ ఆపిల్‌కు గట్టి షాక్ ఇచ్చింది. బ్రెజిల్ దేశవ్యాప్తంగా ఛార్జర్లు లేని ఐఫోన్ల సేల్స్ నిలిపివేయాలని ఆదేశించింది. అంతేకాకుండా ఐఫోన్‌తో  ఛార్జర్‌ అందించనందుకు బ్రెజిల్ ప్రభుత్వం ఆపిల్‌పై సుమారు రూ.18 కోట్ల జరిమానా కూడా విధించింది.

కస్టమర్లకు ఉత్పత్తిని పూర్తిగా అందించడం లేదని ప్రభుత్వం  ఒక ఉత్తర్వుల్లో పేర్కొంది. నేడు అంటే సెప్టెంబర్ 7న ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ జరగబోతోంది.  లాంచ్ ముందు వచ్చిన ప్రభుత్వ నిర్ణయం ఆపిల్‌కు సమస్యగా మారవచ్చని తెలుస్తుంది, ఎందుకంటే కొత్త ఐఫోన్‌ సిరీస్లను కూడా ఛార్జర్ లేకుండా ప్రవేశపెట్టనుంది.

Latest Videos

undefined

ఒక నివేదిక ప్రకారం ఐఫోన్ 12, కొత్త మోడళ్ల సేల్స్ నిలిపివేయాలని బ్రెజిల్ న్యాయ మంత్రిత్వ శాఖ ఆపిల్‌ను ఆదేశించింది. ఛార్జర్‌ అందించని అన్ని ఐఫోన్ మోడల్‌లను మూసివేయాలని కూడా ఆదేశించింది. ఫోన్‌తో పాటు ఛార్జర్‌ను అందించకపోవడం కస్టమర్లపై ఉద్దేశపూర్వక వివక్షతతో కూడిన ప్రవర్తన కిందకు వస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

2020లో ఐఫోన్ 12 లాంచ్‌తో ఆపిల్ ఫోన్‌తో ఛార్జర్‌ను అందించడం ఆపివేసింది. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆపిల్ కంపెనీ తెలిపింది. ఆపిల్  ఈ వాదనలను బ్రెజిల్ న్యాయ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఫోన్‌తో పాటు ఛార్జర్‌ను అందించకపోవడం వల్ల పర్యావరణ భద్రతకు ఎలాంటి ఆధారాలు లేవని మంత్రిత్వ శాఖ తెలిపింది.

సెప్టెంబర్ 7న ఈ రోజు ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్‌ను లాంచ్ చేయబోతోంది, ఈ సిరీస్ కింద ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ లాంచ్ కానున్నాయి. కొత్త ఐఫోన్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 8ని కూడా లాంచ్ చేయనుంది. ఈసారి ఐఫోన్‌లో అతిపెద్ద మార్పు నాచ్‌పై ఉంటుందని చెబుతున్నారు.

click me!