రెడ్‌మి ఏ1 ప్రస్తుతం ఫీచర్ ఫోన్‌లను ఉపయోగిస్తున్న వారి కోసం పరిచయం చేసారు. రెడ్‌మి ఏ1లో డ్యూయల్ రియర్ కెమెరా ఇచ్చారు. అంతేకాకుండా బిగ్ 5000mAh బ్యాటరీ కూడా ఇందులో ఉంది.
రెడ్‌మి ఇండియా ఈరోజు ఇండియన్ మార్కెట్‌లో రెడ్‌మి 11 ప్రైమ్ 5జి అండ్ రెడ్‌మి ఎ1 అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను ప్రవేశపెట్టింది. వీటిలో రెడ్‌మి 11 ప్రైమ్ 5జి అనేది ఎంట్రీ-లెవల్ 5జి స్మార్ట్‌ఫోన్. దీనిని తాజాగా లాంచ్ చేసిన పోకో ఎం5కి నేరుగా తీసుకొచ్చారు, అయితే రెడ్‌మి ఏ1 ప్రస్తుతం ఫీచర్ ఫోన్‌లను ఉపయోగిస్తున్న వారి కోసం పరిచయం చేసారు. రెడ్‌మి ఏ1లో డ్యూయల్ రియర్ కెమెరా ఇచ్చారు. అంతేకాకుండా బిగ్ 5000mAh బ్యాటరీ కూడా ఇందులో ఉంది. రెడ్‌మి ఏ1 మూడు కలర్ ఆప్షన్స్ లో ప్రవేశపెట్టారు.
రెడ్‌మి ఏ1 స్పెసిఫికేషన్లు
ఈ రెడ్‌మి ఫోన్ 120Hz టచ్ శాంప్లింగ్ రేటుతో 6.52-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, ప్రీ ఇన్‌స్టాల్ చేసిన ఎఫ్‌ఎం రేడియో , లైట్ బ్లూ, క్లాసిక్ బ్లాక్ ఇంకా లైట్ గ్రీన్ అనే మూడు కలర్స్ లో ప్రవేశపెట్టారు. ఫోన్‌లో డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్ ఉంటుంది. MediaTek Helio A22 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌ను పొందుతుంది. 2జిబి ర్యామ్ తో 32జిబి స్టోరేజ్ లభిస్తుంది, అలాగే మెమరీ కార్డ్ సహాయంతో 512జిబి వరకు పెంచుకోవచ్చు.
రెడ్‌మి ఏ1 కెమెరా
రెడ్‌మి ఏ1 డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్, దీని ప్రైమరీ లెన్స్ 8 మెగాపిక్సెల్స్, రెండవ లెన్స్ ఏఐ. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. కెమెరాతో ఎన్నో రకాల మోడ్‌లు, ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
రెడ్‌మి ఏ1 బ్యాటరీ
దీనిలో భారీ 5000mAh బ్యాటరీ ఉంది, ఇంకా 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఉంది. ఫోన్ ఉన్న బాక్స్‌లో ఛార్జర్ అందిస్తుంది. దీనితో OTG కూడా సపోర్ట్ చేస్తుంది. Redmi A1తో లెదర్ టేక్శ్చర్ డిజైన్, వెనుక ప్యానెల్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండదు. రెడ్ మీ A1 ధర రూ.6,499. అమెజాన్ ఇంకా రిటైల్ స్టోర్లలో సెప్టెంబర్ 9 సాయంత్రం 4 గంటల నుండి సేల్స్ ప్రారంభమవుతాయి.