జూమ్‌కు ఫేస్‌బుక్ ఆల్టర్నేటివ్ యాప్ ‘మెసేంజర్’

By narsimha lode  |  First Published Apr 26, 2020, 12:02 PM IST

కరోనా లాక్ డౌన్ పుణ్యమా? అని వెలుగులోకి వచ్చిన జూమ్‌ యాప్‌ సంచలనాలు నెలకొల్పుతోంది. ఈ జూమ్ యాప్‌ను ఢీకొట్టేందుకు వివిధ సోషల్ మీడియా సంస్థలు, ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్ పోటీ యాప్‌లను విడుదల చేస్తున్నాయి. 



న్యూఢిల్లీ: కరోనా లాక్ డౌన్ పుణ్యమా? అని వెలుగులోకి వచ్చిన జూమ్‌ యాప్‌ సంచలనాలు నెలకొల్పుతోంది. ఈ జూమ్ యాప్‌ను ఢీకొట్టేందుకు వివిధ సోషల్ మీడియా సంస్థలు, ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్ పోటీ యాప్‌లను విడుదల చేస్తున్నాయి. 

జూమ్ యాప్ సెక్యూరిటీ పరంగా ప్రమాదకరమని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. ఈ యాప్‌ను ఉపయోగించడం మానేయాలని కూడా సూచించింది. వీడియో కాన్ఫరెన్స్‌కు అనుకూలంగా ఉన్న ఈ యాప్‌ను కేంద్ర ప్రభుత్వాధికారులు కూడా ఉపయోగిస్తున్నారు.

Latest Videos

అంతేకాదు పలు కంపెనీలు జూమ్‌ యాప్‌కు ప్రత్యామ్నాయంగా అధునాతన ఫీచర్లతో ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. జూమ్‌ యాప్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. 

‘మెసెంజర్ రూమ్స్’ పేరుతో తన మెసెంజర్ యాప్‌కు.. కొత్తగా వీడియో కాన్పరెన్స్‌ వెర్షన్‌ను జోడించింది. టైమ్‌ లిమిట్‌తో సంబంధం లేకుండా ఇందులో సంభాషణ కొనసాగించవచ్చు. తాము సమావేశం కావాలనుకున్న వారికి ఫేస్‌బుక్ అకౌంట్ లేకపోయినా కూడా.. వినియోగదారులు తమ ‘మెసెంజర్‌ రూమ్స్‌’లోకి వారిని ఆహ్వానించవచ్చునని చెబుతోంది. 

ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో వీడియో కాలింగ్ కోసం అనేక యాప్‌లు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా జూమ్‌ లాంటి యాప్‌లలో వర్చువల్ సమావేశాలతోపాటు.. అనుకూలమైన ఫోటో బ్యాగ్రౌండ్లకు కూడా వీలు ఉండటంతో లక్షల మంది వినియోగదారులు దీనికి ఆకర్షితులు అయ్యారు. 

ఈ క్రమంలోనే ఇప్పటికే వీడియో కాన్ఫరెన్సింగ్‌ ఫీచర్‌ను డెవలప్ చేసిన ఫేస్‌బుక్‌.. త్వరలోనే మెసెంజర్ రూమ్స్‌కి వర్చువల్ బ్యాగ్రౌండ్లను జోడిస్తామని పేర్కొంది. ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ ద్వారా నేరుగా 50 మందితో వీడియో కాన్ఫరెన్స్ జరుపుకునే వెసులుబాటు ఉంది మరి. 

ప్రస్తుతం కొన్ని దేశాలకే పరిమితమైన ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ కొన్ని వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. భారతదేశంలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్, డెస్క్ టాప్ వర్షన్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. భారతదేశ వినియోగదారులు తమ ఫేస్ బుక్ మెసేంజర్ యాప్ అప్ డేట్ చేసుకుంటే సరిపోతుంది. 

also read:నేడే అక్షయ తృతీయ: కరోనాతో ఆన్‌లైన్ సేల్స్‌కే ‘గోల్డ్’ పరిమితం

ఫేస్ బుక్ వినియోగదారులంతా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌ల్లోకి ‘మెసేంజర్’ యాప్ ఓపెన్ చేసి బాటం బార్ నుంచి ‘పీపుల్’ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అటుపై టాప్‌లో ఉన్న ‘క్రియేటివ్ రూమ్’ ఆప్షన్ చూసి ఎంపిక చేసుకోవాలి. మళ్లీ టాప్ లోకి వెళ్లి వీడియో చాట్ బాక్స్ ఓపెన్ చేయాలి. మెసేంజర్ డెస్క్ టాప్ యాప్ మరింత స్పేస్ ఇస్తుంది. 

మెసేంజర్ రూమ్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ లో లింక్ షేర్ చేసుకోవడానికి షేర్ లింక్ ఆప్షన్ ఎంచుకోవాలి. డెస్క్ టాప్ యాప్‌కు సంబంధించి బాటం బార్ లో పార్టిసిపెంట్స్ ఐకాన్ సెలక్ట్ చేసి కాల్ చేస్తే సరి. దీన్ని వాట్సాప్ వంటి యాప్ ద్వారా లింక్ షేర్ చేసుకోవాలి.

click me!