వివిధ ఎలక్ట్రోనిక్ ఉత్పత్తులను అందించిన ఎల్‌జి స్మార్ట్ ఫోన్ రంగంలో కూడా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీలకు పోటీగా లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అప్ డేట్ చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుంది. అయితే ఇప్పుడు సరికొత్త డిజైన్‌తో ఎల్‌జీ వెల్వెట్ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మే 7న ఆవిష్కరించనున్నట్లు తాజాగా ఎల్‌జీ సంస్థ పేర్కొంది.
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ త్వరలో ఒక కొత్తా స్మార్ట్‌ఫోన్ విడుదల చేయనుంది. వివిధ ఎలక్ట్రోనిక్ ఉత్పత్తులను అందించిన ఎల్‌జి స్మార్ట్ ఫోన్ రంగంలో కూడా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీలకు పోటీగా లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అప్ డేట్ చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుంది.
అయితే ఇప్పుడు సరికొత్త డిజైన్‌తో ఎల్‌జీ వెల్వెట్ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మే 7న ఆవిష్కరించనున్నట్లు తాజాగా ఎల్‌జీ సంస్థ పేర్కొంది. ఈ మేరకు కొత్త మోడల్‌కు సంబంధించిన వీడియో టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది.
మిగతా టాప్ కంపెనీల స్మార్ట్‌ఫోన్లకు భిన్నంగా రెయిన్ డ్రాప్(కెమెరాల డిజైన్ వర్షపు చుక్కల మాదిరిగా ఉంటుంది) కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేసింది. కొత్త మోడల్‌కు ఎల్‌జీ వెల్వెట్ అని పేరు కూడా పెట్టినట్లు గతంలోనే వెల్లడించింది.
ఇందులో వెనుక వైపున ఉన్న మూడు కెమెరాల్లో మెయిన్ కెమెరా కాస్త పెద్దగా ఉండగా, మిగతా రెండు కెమెరాలు కాస్త చిన్న సైజ్‌లో ఉన్నాయి. సరికొత్త డిజైన్ ఆకట్టుకుంటోంది. కాకపోతే ఈ స్మార్ట్ ఫోన్ వివరాలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు.
ఎలక్ట్రోనిక్ ఉత్పత్తులను అందించడంలో అగ్రగామిగా ఉన్న ఎల్‌జి సంస్థ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రియులని కొత్త లేటెస్ట్ ఫీచర్స్ గల స్మార్ట్ ఫోన్స్ తో ఎంతగానో ఆకర్షిస్తుంది.