ప్రాబ్లం సాల్వ్ డ్.. అందుబాటులోకి వచ్చిన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్ స్టా సేవలు...

By AN TeluguFirst Published Oct 5, 2021, 7:42 AM IST
Highlights

మంగళవారం ఉదయం 4. 30 గంటలకు వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​లు క్షమాపణలు చెప్పాయి. 

ఎట్టకేలకు సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్ (WhatsApp)​, ఫేస్​బుక్ (face book)​, ఇన్​స్టాగ్రామ్ (Instagram)​ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏడు గంటలపాటు ప్రపంచ వ్యాప్తంగా ఫేస్​బుక్​, వాట్సాప్​, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలకు బ్రేక్ (break) పడిన సంగతి తెలిసిందే.

మంగళవారం ఉదయం 4. 30 గంటలకు వీటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​లు క్షమాపణలు చెప్పాయి. 

ఊహించని విధంగా ఈ మూడు సోషల్ మీడియా (social media) సేవలకు అంతరాయం (Interruption) ఏర్పడటంతో ఈ ప్లాట్‌ఫాంలను వినియోగించే కోట్లాది మంది వినియోగదారులు (users) ఇబ్బందిపడ్డారు. అసలేం జరుగుతుందో తెలియకపోవడంతో కన్ఫ్యూజ్ అయ్యారు.

అయితే ఒక్కసారిగా సేవలు నిలిచిపోవడంతో ఫేస్ బుక్ సంస్థకు భారీగా నష్టం (heavy loss) వాటిల్లినట్లు సమాచారం. కేవలం కొన్ని నిమిషాల పాటు సేవలు అందుబాటులో లేనందున మార్కెట్లో ఫేస్ బుక్ సంస్థ షేర్ల విలువ (share value) 6 శాతం తగ్గినట్లుగా (down) కథనాలు వస్తున్నాయి. ఫేస్‌బుక్ వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ సేవలు పునరుద్ధరించేందుకు టెకీలు తీవ్రంగా యత్నించారు.

సోమవారం సాయంత్రం నుంచి.. : సోమవారం సాయంత్రం నుంచి వివిధ దేశాల్లో వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ డౌన్ అయ్యింది. దీనిపై యూజర్లు వివిధ ఇతర వేదికల్లో ఫిర్యాదులు చేశారు. ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌లోనూ ఇందుకు సంబంధించి మెసేజ్ (message) ఒకటి కనిపించింది. 

ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ సేవలు... ట్విట్టర్ లో నడుస్తున్న మీమ్ ఫెస్ట్

అంతరాయం (Interruption) కలుగుతోందని.. తాము దానిపై పని చేస్తున్నామని ఫేస్‌బుక్ పేర్కొంది. త్వరలోనే దాన్ని పరిష్కరించి (resolve) మీ ముందుకొస్తామని (will back) వెల్లడించింది. దాదాపు మంగళవారం ఉదయం 4. 30 గంటల సమయంలో సేవలు అందుబాటులోకి తెచ్చింది. 

ఈ మేరకు వాట్సాప్​ ఓ ప్రకటన విడుదల చేసింది. ''ఈ రోజు వాట్సాప్ ఉపయోగించలేకపోయిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు. మేం నెమ్మదిగా, జాగ్రత్తగా ఈ వాట్సాప్(WhatsApp) మళ్లీ పని చేసేలా చేశాం. మీ సహనానికి చాలా ధన్యవాదాలు."అని తెలిపింది.

click me!