రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి టీఆర్ఎస్:పరస్పరం దాడి చేసుకొన్న కాంగ్రెస్, గులాబీ శ్రేణులు, ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Sep 21, 2021, 2:48 PM IST
Highlights

మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ  రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసం వద్ద మంగళవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది.  మంత్రి కేటీఆర్(ktr) పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy)వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులకు, టీఆర్ఎస్(trs) కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొంది.

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మును దగ్ధం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు  అడ్డుకొన్నారు. ఈ సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ రెడ్డి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకొన్న కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో టీఆర్ఎస్ శ్రేణులపై దాడికి దిగారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలను పోలీసులు అక్కడి నుండి చెదరగొట్టారు. 

also read:కొండా సవాల్‌కి బండి సై: ప్రజా సంగ్రామయాత్ర తర్వాత ఎక్కడికైనా వస్తా

మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ రేవత్ రెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొన్నారు. పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ క్రమంలోనే కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకొంది. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం నాడు మంత్రి కేటీఆర్, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సవాల్ విసిరారు. తాను డ్రగ్స్ టెస్టుకు సిద్దమని తన వెంట్రుకలు రక్త నమూనాలను ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. కేటీఆర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిద్దమా అని ప్రశ్నించారు.

ఈ విషయమై కేటీఆర్ కూడా కూడ స్పందించారు. రాహుల్ గాంధీ పరీక్షలకు సిద్దమైతే తాను కూడ పరీక్షలు చేయించుకొంటానని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి లైడిటెక్టర్ పరీక్షలకు సిద్దమా అని కేటీఆర్ ప్రశ్నించారు.

అయితే ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. సహారా కుంభకోణం, పీఎఫ్ స్కామ్ లో కేసీఆర్   లై డిటెక్టర్ పరీక్షలకు సిద్దమైతే తాను కూడ సిద్దమేనని రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి స్పందించారు.రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. సరైన పత్రాలుత లేకపోవడంతో  ఈ పిటిషన్ ను కోర్టు రిటర్న్ చేసింది.

click me!