స్మార్ట్ స్పీకర్ ఎడిషన్ అమెజాన్ తన ఎకో సిరీస్‌లో అలెక్సా ఎనేబుల్డ్ స్మార్ట్ స్పీకర్ ను ప్రవేశపెట్టింది.ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఎకో సిరీస్‌లో ఓ కొత్త పోర్టబుల్ అలెక్సా ఎనేబుల్డ్ స్మార్ట్ స్పీకర్ ను భారత్‌లో విడుదల చేసింది.
అమెజాన్ ఎకో సిరీస్‌లో స్మార్ట్ స్పీకర్లు ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్పీకర్లు, ఇందులో భారతదేశం కూడా ఉంది. అమెజాన్ కంపెనీ భారతీయ మార్కెట్లో దాని ప్రజాదరణను పెంచుకుంటూ, భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా కొత్త ఎకో స్మార్ట్ స్పీకర్‌ను విడుదల చేసింది.
also read జియో... కస్టమర్లందరూ ఇక నుంచి చార్జీలు భరించాల్సి ఉంటుంది....
undefined
ఇండియా-స్పెసిఫిక్ ఎకో ఇన్పుట్ పోర్టబుల్ స్మార్ట్ స్పీకర్ ఎడిషన్ అమెజాన్ తన ఎకో సిరీస్‌లో అలెక్సా ఎనేబుల్డ్ స్మార్ట్ స్పీకర్ ను ప్రవేశపెట్టింది.ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఎకో సిరీస్‌లో ఓ కొత్త పోర్టబుల్ అలెక్సా ఎనేబుల్డ్ స్మార్ట్ స్పీకర్ ను భారత్‌లో విడుదల చేసింది.
ఎకో ఇన్పుట్ పోర్టబుల్ స్మార్ట్ స్పీకర్ ఎడిషన్ అని దీనిని పిలుస్తారు. అమెజాన్ తాజా ప్రాడక్ట్ 360 డిగ్రీల సౌండ్ కాంపాక్ట్ స్పీకర్ అయినప్పటికీ ఈ స్పీకర్ ఇన్ బిల్ట్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 4,800 ఎంఏహెచ్ సామర్థ్యంతో 11 గంటల స్టాండ్బై బ్యాటరీ నాన్ స్టాప్ మ్యూజిక్ ప్లేబ్యాక్ అందిస్తుందని అమెజాన్ తెలిపింది.
అమెజాన్ అలెక్సా డివైజెస్ వి.పి మిరియం డేనియల్ మాట్లాడుతూ “భారతదేశంలో మ్యూజిక్ ఎక్కువగా వినే వాళ్ళలో ఎక్కువ మంది కోరిన లక్షణాలలో పోర్టబిలిటీ ఒకటి. అలెక్సాను మీ ఇళ్లలో నుండి గదికి, బయటికి ఎక్కడికైనా తీసుకెళ్లతనికి అనువుగా ఉండాలి అని మేము మీ కోసం దీనిని రూపొందించాము "అని అన్నారు.
also read వాయిస్ వైఫైతో కాల్ డ్రాప్స్‌కు తెర.. ఈ ఏడాదిలోనే
ముఖ్యంగా అమెజాన్ కంపెనీ బ్యాటరీతో నడిచే ఎకో స్పీకర్లను ప్రపంచంలో ఇప్పటివరకు అమ్మలేదు. అయితే 2016లో అమెజాన్ ట్యాప్ అని పిలిచే ఒక డివైజ్ విడుదల చేసినప్పటికీ అది పెద్దగా ఆదరణ పొందలేదు తర్వాత దానిని నిలిపివేశారు.
మీరు ఎకో సిరీస్‌లో స్మార్ట్ స్పీకర్లను ఇష్టపడే వారైతే అమెజాన్ కొత్త వైర్‌లెస్ ఎకో స్పీకర్ మీకు మంచి ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా దిని ధర రూ .4,999. ఎకో ఇన్పుట్ పోర్టబుల్ స్మార్ట్ స్పీకర్ ఎడిషన్ డిసెంబర్ 18 న విడుదల కానుంది. ఆ తర్వాత దాని రిటైల్ ధర రూ .5,999 వరకు పెంచబడుతుంది.