ట్విట్టర్ బ్లూ టిక్: యూజర్లు ఇప్పుడు ప్రతి నెల చార్జ్ చెల్లించాలి లేదంటే..?

Published : Oct 31, 2022, 02:24 PM ISTUpdated : Oct 31, 2022, 02:25 PM IST
ట్విట్టర్ బ్లూ టిక్:  యూజర్లు ఇప్పుడు ప్రతి నెల చార్జ్ చెల్లించాలి లేదంటే..?

సారాంశం

 ట్విట్టర్‌ బ్లూకు సబ్‌స్క్రిప్షన్ పొందిన తర్వాత యూజర్లు ట్వీట్ ఎడిట్ తో సహా ఎన్నో స్పెషల్ ఫీచర్‌లను పొందుతారు. ట్విట్టర్‌ బ్లూ ప్రతినెల సబ్‌స్క్రిప్షన్ $ 19.99 డాలర్లు అంటే దాదాపు రూ. 1,600. 

టెస్లా సి‌ఈ‌ఓ ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత కొంత మంది సంతోషం వ్యక్తం చేయగా మరికొంత మంది విచారం వ్యక్తం చేశారు. అయితే చాలా మంది ఎలోన్ మస్క్ తీసుకున్న నిర్ణయాన్ని  స్వాగతిస్తున్నారని, ఎలోన్ మస్క్ ట్వీట్టర్ అధినేత అయిన తర్వాత ట్విట్టర్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని, ప్రజలు తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పవచ్చని అంటున్నారు. అయితే ఈ మధ్య మరో ఒక పెద్ద వార్త వస్తోంది. అదేంటంటే మీరు కూడా ట్విట్టర్‌లో వేరిఫైడ్ (బ్లూ టిక్) యూజర్ అయితే మీరు నెలకు దాదాపు రూ. 1,600 చెల్లించాల్సి రావచ్చు.

కొత్త నివేదిక ప్రకారం, ఎలోన్ మస్క్ బ్లూ వెరిఫికేషన్ ప్రక్రియను మార్చాలని యోచిస్తున్నాడు. నిజానికి ఒక యూజర్ ఎలోన్ మస్క్‌ని ట్వీట్ ద్వారా అతనికి భారీగా ఫాలోవర్స్ ఉన్నారని అయినప్పటికీ తనికి బ్లూ టిక్‌ పొందలేకపోతున్న అని చెప్పగా ఈ ట్వీట్‌కు సమాధానంగా ఎలోన్ మస్క్ పెయిడ్ బ్లూ టిక్‌ని సూచించాడు. ఒక ఇంగ్లీష్ వెబ్‌సైట్ ఈ విషయాన్ని మొదట నివేదించింది.

నివేదిక ప్రకారం, ట్విట్టర్‌ బ్లూ టిక్ కేవలం ట్విట్టర్‌ బ్లూ సభ్యులకు మాత్రమే ఉంటుంది, అంటే ఇది సబ్‌స్క్రిప్షన్  సర్వీస్. ట్విట్టర్‌ బ్లూకు సబ్‌స్క్రిప్షన్ పొందిన తర్వాత యూజర్లు ట్వీట్ ఎడిట్ తో సహా ఎన్నో స్పెషల్ ఫీచర్‌లను పొందుతారు. ట్విట్టర్‌ బ్లూ ప్రతినెల సబ్‌స్క్రిప్షన్ $ 19.99 డాలర్లు అంటే దాదాపు రూ. 1,600. ఇప్పటికే అకౌంట్ వెరిఫై అయిన వారు 90 రోజుల్లోగా ట్విటర్ బ్లూ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని లేకుంటే ప్రొఫైల్ నుంచి బ్లూ టిక్ తొలగించబడుతుందని చెబుతున్నారు.

ట్విట్టర్ ఇంజనీర్‌లు ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయకపోతే వారు కూడా ఉద్యోగాలను కోల్పోతారని నివేదికలో పేర్కొంది. గత వారం ఎలోన్ మస్క్ ట్విట్టర్  ని సొంతం చేసుకున్నాక అప్పటి సి‌ఈ‌ఓ పరాగ్ అగర్వాల్‌తో సహా నలుగురు పెద్ద ఎగ్జిక్యూటివ్‌లను తొలగించిన సంగతి మీకు తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

మీ మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా..? ఈ చిట్కాలు పాటిస్తే 2 నిమిషాల్లో 10-20GB ఎక్స్ట్రా స్పేస్
Smartphone: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్‌.. రూ. 15 వేలకే స్ట‌న్నింగ్ స్మార్ట్ ఫోన్