24 గంటల కంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌తో కొత్త ఇయర్ బడ్స్.. లైట్ వెయిట్, వాటర్ రిసిస్టంట్ కూడా..

Published : Oct 29, 2022, 02:01 PM IST
24 గంటల కంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌తో కొత్త ఇయర్ బడ్స్.. లైట్ వెయిట్, వాటర్ రిసిస్టంట్ కూడా..

సారాంశం

నథింగ్ ఇయర్ స్టిక్ ధర రూ. 8,499, దీని సేల్స్ నవంబర్ 4 నుండి ఇండియాతో పాటు US, UK, యూరప్‌లలో ప్రారంభమవుతాయి. అయితే ఈ బడ్స్ ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైంది. 

కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ నథింగ్ కొత్త ప్రాడక్ట్ నథింగ్ ఇయర్ స్టిక్‌ను ఇండియాతో పాటు ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఏరోనామిక్ డిజైన్‌తో పరిచయం చేసిన ఇయర్‌బడ్‌లలో నథింగ్ ఇయర్ స్టిక్ ఒకటి. నథింగ్ ఇయర్ స్టిక్ నథింగ్ ఇయర్ 1కి చాలా భిన్నంగా ఉంటుంది. నథింగ్ ఇయర్ స్టిక్ 7 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుందని పేర్కొంది, అయితే ఛార్జింగ్‌తో  చార్జింగ్ లైఫ్ 29 గంటలు ఉంటుంది.

నథింగ్ ఇయర్ స్టిక్ ధర
నథింగ్ ఇయర్ స్టిక్ ధర రూ. 8,499, దీని సేల్స్ నవంబర్ 4 నుండి ఇండియాతో పాటు US, UK, యూరప్‌లలో ప్రారంభమవుతాయి. అయితే ఈ బడ్స్ ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమైంది. నథింగ్ ఇయర్ స్టిక్ కేవలం సింగిల్ కలర్ వేరియంట్ అంటే వైట్‌ కలర్ లో మాత్రమే లభిస్తుంది.

నథింగ్ ఇయర్ స్టిక్ స్పెసిఫికేషన్లు
నథింగ్ ఇయర్ స్టిక్ కంపెనీ నుండి వస్తున్న మూడవ ఉత్పత్తి. ఇంతకుముందు కూడా ఇయర్‌బడ్స్ అండ్ ఒక ఫోన్ కూడా లాంచ్ చేసింది. నథింగ్ ఇయర్ స్టిక్ కేస్ ట్విస్ట్ ఓపెనింగ్‌తో వస్తుంది. నథింగ్ ఇయర్ స్టిక్‌తో 12.6mm డైనమిక్ డ్రైవర్ ఉంది. ఇంకా వాటర్ రిసిస్టంట్ కోసం IP54 రేటింగ్‌ను పొందింది. నథింగ్ ఇయర్ స్టిక్‌తో ఇన్-ఇయర్ డిటెక్షన్ కూడా ఉంది.

బ్యాటరీ గురించి మాట్లాడితే నథింగ్ ఇయర్ స్టిక్ 7 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది, అయితే ఛార్జింగ్ కేస్‌తో మొత్తం బ్యాటరీ లైఫ్ 29 గంటలు. బడ్స్  కేవలం 4.4 గ్రాముల బరువు మాత్రమే ఉంటాయి. నథింగ్ ఇయర్ 1 బరువు 4.7 గ్రాములు. దీనికి ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్‌ ఉంది.

PREV
click me!

Recommended Stories

ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ ఉండాల్సిందే.. అసలేంటిది? ఏం చేస్తుంది?
కేవలం రూ.45,900కే ఐఫోన్ 17 : క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో బిగ్ ఆఫర్