బిఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్ కింద రూ. 1,198, రూ. 439 రెండు టారిఫ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ రెండు ప్లాన్లు లాంగ్ వాలిడిటీతో వస్తాయి అంటే మీరు 90 రోజుల నుండి 365 రోజుల వరకు వాలిడిటీని పొందుతారు.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త టారిఫ్ ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్లు దేశవ్యాప్తంగా ఉన్న ప్రీపెయిడ్ యూజర్లందరికి వివిధ బెనెఫిట్స్ తో వస్తాయి. బిఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్ కింద రూ. 1,198, రూ. 439 రెండు టారిఫ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ రెండు ప్లాన్లు లాంగ్ వాలిడిటీతో వస్తాయి అంటే మీరు 90 రోజుల నుండి 365 రోజుల వరకు వాలిడిటీని పొందుతారు. ఈ ప్లాన్లతో పాటు కంపెనీ రూ. 269 అండ్ రూ. 739 అనే మరో రెండు గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ వోచర్లను కూడా ప్రకటించింది. ఈ ప్లాన్ల గురించి తెలుసుకుందాం...
బిఎస్ఎన్ఎల్ రూ. 1198 ప్లాన్
బిఎస్ఎన్ఎల్ రూ. 1198 రీఛార్జ్ ప్లాన్‌తో పూర్తిగా 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే మీరు ఏడాది మొత్తంలో మళ్ళీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్‌తో కస్టమర్లు మొత్తం నెలకు 3జిబి డేటా, 300 నిమిషాల వాయిస్ కాలింగ్ అండ్ నెలకు 30ఎస్ఎంఎస్ లు పొందుతారు.
undefined
బిఎస్ఎన్ఎల్ రూ. 439ప్లాన్
బిఎస్ఎన్ఎల్ రూ. 439 రీఛార్జ్ ప్లాన్‌తో మీకు మూడు నెలల వాలిడిటీ లభిస్తుంది. అంటే ప్రతి నెలా 150 రూపాయల లోపే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ప్లాన్‌తో మూడు నెలల పాటు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, దీనితో పాటు వినియోగదారులు 300ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని పొందుతారు. అయితే, ఈ ప్లాన్‌తో డేటా బెనెఫిట్స్ లేవు.
బిఎస్ఎన్ఎల్ రూ 769 ప్లాన్
బిఎస్ఎన్ఎల్ రూ. 769 రీఛార్జ్ ప్లాన్ కూడా ఆన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలతో 90 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ప్లాన్‌తో పాటు రోజుకు 2GB డేటా కూడా లభిస్తుంది. కస్టమర్లు ఈ ప్లాన్‌తో ఎంటర్టైన్మెంట్ అండ్ గేమింగ్ వోచర్లను కూడా పొందుతారు. దీనితో పాటు కస్టమర్లు గేమ్‌లలో రూ. 2 లక్షల వరకు గిఫ్త్స్ గెలుచుకునే అవకాశాన్ని కూడా పొందుతారు.
బిఎస్ఎన్ఎల్ రూ. 269 ప్లాన్
బిఎస్ఎన్ఎల్ రూ.269 రీఛార్జ్ ప్లాన్ తో 30 రోజుల వాలిడిటీ రోజుకు 2GB డేటా, 100 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌తో పాటు రూ. 769 ప్లాన్ అన్ని వోచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.