ఎక్కువ వాలిడిటీ, ఇంటర్నెట్, కాల్స్ కోసం బెస్ట్ రిచార్జ్ ప్లాన్.. ఫేస్ బుక్, ట్విట్టర్ కూడా వాడొచ్చు...

Published : Dec 01, 2022, 07:12 PM IST
ఎక్కువ వాలిడిటీ, ఇంటర్నెట్, కాల్స్ కోసం బెస్ట్ రిచార్జ్ ప్లాన్.. ఫేస్ బుక్, ట్విట్టర్ కూడా వాడొచ్చు...

సారాంశం

 మీరు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)  కస్టమర్ అయితే తక్కువ డేటా ఉపయోగిస్తే లేదా సెకండరీ సిమ్ ని యాక్టివ్‌గా ఉంచాలనుకుంటే, బి‌ఎస్‌ఎన్‌ఎల్ ఈ అతిరక్కువ రీఛార్జ్ మీకు బెస్ట్ ఆప్షన్. 

భారతీయ టెలికాం మార్కెట్‌లో జియో, ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు ఆధిపత్యం చెలాయించినప్పటికీ, కస్టమర్లకు బడ్జెట్ రీఛార్జ్ ప్లాన్‌లను అందించడంలో బి‌ఎస్‌ఎన్‌ఎల్ ఎయిర్‌టెల్, జియోని కూడా వెనక్కి నెట్టివేసింది. మీరు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)  కస్టమర్ అయితే తక్కువ డేటా ఉపయోగిస్తే లేదా సెకండరీ సిమ్ ని యాక్టివ్‌గా ఉంచాలనుకుంటే, బి‌ఎస్‌ఎన్‌ఎల్ ఈ అతిరక్కువ రీఛార్జ్ మీకు బెస్ట్ ఆప్షన్. మీరు BSNL కస్టమర్ ఆయితే తక్కువ ధర, ఎక్కువ  వాలిడిటీ అండ్  కాలింగ్ సౌకర్యాన్ని పొందాలనుకుంటే, ఈ రిచార్జ్ ప్లాన్ కోసం. BSNL ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ తో మీరు తక్కువ ధరకే ఎన్నో బెనెఫిట్స్ పొందుతారు. BSNL ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర కేవలం రూ.94 మాత్రమే. ఈ రీఛార్జ్ ప్లాన్ గురించి ఇంకా  బెనెఫిట్స్ గురించి తెలుసుకోండి...

BSNLరూ. 94 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో మీరు పూర్తిగా 45 రోజుల వాలిడిటీ పొందుతారు. దీనితో పాటు ఈ ప్లాన్‌తో కాలింగ్ అండ్ డేటా బెనెఫిట్స్ కూడా ఉంటాయి. ఈ BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో కస్టమర్లు లోకల్ అండ్ నేషనల్ కాల్స్ పూర్తిగా 200 నిమిషాలు పొందుతారు.

అంటే, మీరు మీ రాష్ట్రంలో అలాగే దేశంలోని ఏ రాష్ట్రం లేదా నగరంలోనైన మాట్లాడవచ్చు. కాల్స్ మాత్రమే కాకుండా మీరు ఇంటర్నెట్ కోసం 3జి‌బి డేటా కూడా పొందుతారు. డేటా వాలిడిటీ కూడా 45 రోజులు ఉంటుంది. అంటే, మీరు డైలీ డాటా పొందలేరు. 

మీకు 45 రోజుల పాటు ఉపయోగించడానికి 3 GB డేటా మాత్రమే అందిస్తుంది. మీరు తక్కువగా ఆన్‌లైన్ వీడియోలు ఇంకా సోషల్ మీడియాను ఉపయోగిస్తే లేదా మీ సెకండరీ సిమ్ కోసం రీఛార్జ్ చేయాలనుకుంటే, ఈ ప్లాన్ మీకు బెస్ట్ ఆప్షన్.
 

PREV
click me!

Recommended Stories

ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ ఉండాల్సిందే.. అసలేంటిది? ఏం చేస్తుంది?
కేవలం రూ.45,900కే ఐఫోన్ 17 : క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో బిగ్ ఆఫర్