1 టి‌బి స్టోరేజ్, 18జి‌బి ర్యామ్ తో మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్.. ట్రిపుల్ కెమెరాతో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్

By asianet news telugu  |  First Published Dec 1, 2022, 6:58 PM IST

కంపెనీ తాజాగా ఈ ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. జెడ్‌టి‌ఈ అక్సాన్ 40 అల్ట్రా  కొత్త ఎడిషన్  18జి‌బి ర్యామ్, 1టి‌బి వరకు స్టోరేజ్ తో పరిచయం చేసింది. ఈ  కొత్త ఎడిషన్ ని సింగిల్ బ్లాక్ కలర్‌లో పరిచయం చేసారు. 


స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ  జెడ్‌టి‌ఈ అక్సాన్ 40 సిరీస్ క్రింద పవర్ ఫుల్ ఫోన్  జెడ్‌టి‌ఈ అక్సాన్ 40 అల్ట్రా   ఏరోస్పేస్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. కంపెనీ తాజాగా ఈ ఫోన్‌ను దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. జెడ్‌టి‌ఈ అక్సాన్ 40 అల్ట్రా  కొత్త ఎడిషన్  18జి‌బి ర్యామ్, 1టి‌బి వరకు స్టోరేజ్ తో పరిచయం చేసింది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్, 64 మెగాపిక్సెల్ లెన్స్‌తో 3 బ్యాక్ కెమెరాల సపోర్ట్ ఉంది. కంపెనీ తాజాగా జెడ్‌టి‌ఈ అక్సాన్ 40 ప్రొని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది.

ధర 
జెడ్‌టి‌ఈ అక్సాన్ 40 అల్ట్రా  కొత్త ఎడిషన్ ని సింగిల్ బ్లాక్ కలర్‌లో పరిచయం చేసారు. ఇంకా రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో వస్తుంది. 16జి‌బి ర్యామ్‌తో కూడిన 512జి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర 5,898 యువాన్ అంటే దాదాపు రూ. 67,200, 18జి‌బి ర్యామ్ 1టి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర 7,698 యువాన్ అంటే సుమారు రూ. 87,700.  

Latest Videos

undefined

 ఫీచర్స్ 
జెడ్‌టి‌ఈ ఆక్సాన్ 40 అల్ట్రా  ప్రత్యేక ఎడిషన్ 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లే (1116x2480 పిక్సెల్‌లు), 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ ఉంది. ఫోన్ 4nm మొబైల్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్‌  ఉంది. ఫోన్‌తో ఇండిపెండెంట్ సెక్యూరిటి చిప్ సపోర్ట్ కూడా అందించారు. Android 12  MyOS 12 ఫోన్‌కు సపోర్ట్ చేస్తుంది. 

కెమెరా అండ్ బ్యాటరీ లైఫ్ 
ZTE కొత్త ఎడిషన్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మిగిలిన రెండు కెమెరాలకు 64 మెగాపిక్సెల్‌ ఇచ్చారు.  సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ అండర్-స్క్రీన్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌తో 8కె రికార్డింగ్ కూడా చేయవచ్చు. ZTE Axon 40 అల్ట్రా ఏరోస్పేస్ ఎడిషన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది, ఇంకా 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఉంది. 

 కంపెనీ ఈ ఏడాది జూలైలో ZTE Axon 40 Proని పరిచయం చేసింది. ఈ ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Android 12  MyOS 12 అండ్ Qualcomm Snapdragon 870 ప్రాసెసర్ ఫోన్‌లో లభిస్తుంది. ఫోన్‌లో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెకండ్ కెమెరా, మూడవ కెమెరా మాక్రో లెన్స్, సెల్ఫీ అండ్ వీడియో కాల్‌ల కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ లో 5000mAh బ్యాటరీని ఉంది ఇంకా 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

click me!