ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీలో మార్పులు...

By Sandra Ashok KumarFirst Published Dec 7, 2019, 10:54 AM IST
Highlights

బిఎస్‌ఎన్‌ఎల్ కూడా రూ. 7, రూ. 9, రూ. 192  ప్రీపెయిడ్ ప్లాన్లను కొన్ని సర్కిల్‌లలో తీసేసింది. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోతో సహా టెల్కోలు  ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్‌లను పెంచిన కొద్ది రోజులకే ఈ ప్లాన్ల వాలిడిటీని సవరణ చేసింది.

భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను సవరించింది. మార్పు చేసిన ప్రీపెయిడ్ ప్లాన్    రూ. 29, రూ. 47, మొదట తొమ్మిది రోజుల వాలిడిటీ అందించే విధంగా రూపొందించబడ్డాయి. అయితే, ప్రభుత్వ యాజమాన్యంలోని ఆపరేటర్ ఇప్పుడు రెండు ప్లాన్‌ల వాలిడిటీని తగ్గించారు.

also read  ఆపిల్ ఐఫోన్ SE 2 ప్లస్...పూర్తిగా వైర్‌లెస్ ఫోన్

బిఎస్‌ఎన్‌ఎల్ కూడా రూ. 7, రూ. 9, రూ. 192  ప్రీపెయిడ్ ప్లాన్లను కొన్ని సర్కిల్‌లలో తీసేసింది. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోతో సహా టెల్కోలు  ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్‌లను పెంచిన కొద్ది రోజులకే ఈ ప్లాన్ల వాలిడిటీని సవరణ చేసింది. హర్యానా బిఎస్‌ఎన్‌ఎల్  వెబ్‌సైట్‌లో లభించే లిస్టింగ్ ప్రకారం రూ. 29 బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఏడు రోజుల వాలిడిటీని ఐదు రోజులకు తగ్గించి సవరించారు.

ఈ ప్లాన్లో  ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1 జిబి డేటా, 300 ఎస్ఎంఎస్  అందిస్తుంది.ఇక రూ. 47 బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్  వాలిడిటీని కూడా ఏడు రోజులకు తగ్గించింది. ఈ ప్లాన్ గతంలో తొమ్మిది రోజుల వాలిడిటీ ఉండేది. ఏదేమైనా ప్రయోజనాలు గతంలో అందించిన వాటికి అనుగుణంగా ఉంటాయి. అపరిమిత వాయిస్ కాల్స్ (రోజుకు 250 నిమిషాల టాక్ టైమ్), 1GB డేటా .

also read ఇలాగైతే వొడాఫోన్‌ ఐడియా మూసివేయాల్సి వస్తుంది...?

బిఎస్‌ఎన్‌ఎల్ రూ. 7, రూ. 9, రూ. 192 ప్రీపెయిడ్ ప్లాన్లను తిసేసినట్టు టెలికాం టాక్ నివేదించింది. రూ. 7 బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1 జిబి డేటాను అందిస్తుంది, రూ. 9 ప్లాన్ ఒక రోజుకు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఇంకా రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లను అందించింది. 

బిఎస్ఎన్ఎల్  ప్రీపెయిడ్ ప్లాన్లపై మేము ఇంకా ఎలాంటి పూర్తి నిర్ణయం తిసుకోలేదు. బిఎస్ఎన్ఎల్ కలకత్తా వంటి నగరాల్లో ఇప్పటికీ రూ.192 ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ప్రభుత్వ టెల్కో త్వరలో తన ప్రీపెయిడ్ ప్లాన్లను సవరించాలని  అనుకుంటుంది.
 

click me!