యాంట్ బ్రాండ్ ఇప్పుడు కొత్త ఆడియో రిమోట్ కంట్రోల్స్ ఇంకా సాంగ్ రికార్డింగ్ వంటి ఫీచర్స్ తో 3 కొత్త పార్టీ స్పీకర్లను విడుదల చేసింది.యాంట్ బ్రాండ్ భారతదేశంలో వారి బ్రాండ్ ని విస్తరింపచేయడానికి ఈ కొత్త ఉత్పత్తులను డిజైన్ చేసి ఇండియాలో లాంచ్ చేశారు.
ఆడియో డివైజెస్ ప్రముఖ తయారీదారు యాంట్ బ్రాండ్ సంస్థ ఆడియో కొత్త శ్రేణి పార్టీ స్పీకర్లను ప్రారంభించింది. ఈ కొత్త సిరీస్ లో రాక్ 400, రాక్ 300 అలాగే రాక్ 150 బ్లూటూత్ పార్టీ స్పీకర్లను మరియు హోమ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. యాంట్ బ్రాండ్ భారతదేశంలో వారి బ్రాండ్ ని విస్తరింపచేయడానికి ఈ కొత్త ఉత్పత్తులను డిజైన్ చేసి ఇండియాలో లాంచ్ చేశారు.
మెరుగైన, ప్రభావవంతమైన యాంట్ బ్రాండ్ ఆడియో రాక్ 400 స్పీకర్ తో మీ ఇంట్లో లేదా బయటి ప్రదేశాలలో మ్యూజిక్ తో అందరినీ అలరించవచ్చు. ఈ పోర్టబుల్ డివైజ్ లో 5-ఇంచ్ సబ్ వూఫర్ & 4 ఓహ్మ్ + 2.5-అంగుళాల x 2 ట్వీటర్ స్పీకర్ ఉన్నాయి.
యాంట్ ఆడియో రాక్ 400 (స్పీకర్) ఫీచర్స్:
బ్లూటూత్ వెర్షన్ 5.0 తో 2000mAh సామర్థ్యం
వైర్డ్ మైక్ & రిమోట్ కంట్రోల్ ఉంటుంది
అన్ని కొత్త స్మార్ట్ డివైజ్ తో కనెక్ట్ అవుతుంది
also read మార్కెట్ లోకి కొత్త బ్లూటూత్ స్పీకర్...10 గంటల వరకు నాన్ స్టాప్ మ్యూజిక్
రికార్డింగ్ ఫంక్షన్ & ఎకో ఫీచర్స్
యాంట్ ఆడియో రాక్ 400 (స్పీకర్)ధర రూ .8,499
ప్రస్తుత ఆఫర్ ధర రూ. 3,999
యాంట్ ఆడియో రాక్ 300 (స్పీకర్)
కొత్త రాక్ 300 (పార్టీ స్పీకర్) తో మీ ఇంటిని మీ డ్యాన్స్ స్టూడియో చెయ్యొచ్చు. చూడటానికి ఆహ్లాదకరంగా కనిపించే కాంపాక్ట్ డిజైన్‌తో, రాక్ 300 గొప్ప ఆకర్షణీయంగా ఉంది.
దీని ఫీచర్స్:
4-అంగుళాల సబ్ వూఫర్ & 4Ohm + 2.5inch x 2 ట్వీటర్ గరిష్ట ఓంఫ్ కోసం స్పీకర్ సెటప్.
రిమోట్ కంట్రోల్‌ను కలిగి ఉంటుంది
రికార్డింగ్ ఫంక్షన్ & ఎకో ఫీచర్స్
యాంట్ ఆడియో రాక్ 300 (స్పీకర్) ధర: రూ .6,499
ఆఫర్ ధర: రూ .1,199
యాంట్ ఆడియో రాక్ 150 (స్పీకర్)
ఇది మీ ఇంటిని ఒక అధ్భూతమైన ఎంటర్టైన్మెంట్ సిస్టంగా మారుస్తుంది. సబ్ వూఫర్‌తో ఉన్న 2 ఛానల్ స్పీకర్ మీకు హైస్, మిడ్స్, లో కాంబినేషన్ ఇస్తుంది. యాంట్ ఆడియో రాక్ 150 అనేది వినియోగంలో యుటిలిటీ విషయానికి వస్తే ఇదీ ఒక పవర్ ఫుల్ సిస్టం, ఎందుకంటే ఇది తక్కువ స్థలంలో ఎక్కువ అవుట్పుట్ అద్భుతమైన సౌండ్ ప్లే చేస్తుంది.
దీని ఫీచర్స్:
4-ఇంచ్ 15W సబ్ వూఫర్‌తో నిర్మించచారు
డిజిటల్ స్క్రీన్ & వైర్డు మైక్రోఫోన్ సులభంగా కంట్రోల్ చేయడానికి అవసరమైన అన్ని బటన్లతో వస్తుంది.
కరోకే కోసం మైక్రోఫోన్ ఉంటుంది
also read ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్...కొనుగోళ్లకి ఇదే గొప్ప అవకాశం !
యాంట్ ఆడియో రాక్ 150 (స్పీకర్) ధర: రూ .4,999
ఆఫర్ ధర: రూ .1,999
యాంట్ ఆడియో పార్టీ స్పీకర్లను ప్రారంభించినప్పుడు, యాంట్ ఆడియో డైరెక్టర్ హిమాన్షు జైన్ మాట్లాడుతూ “2020 మాకు గొప్ప సంవత్సరం అవుతుంది. మా క్రొత్త పోర్ట్‌ఫోలియోను మా కస్టమర్ల ముందుకు తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము." అని అన్నారు.
ఈ కొత్త ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మైంట్రా, స్నాప్‌డీల్, పేటీఎంమాల్, టాటా క్లిక్ వంటి అన్ని ప్రధాన ఇ-కామర్స్ పోర్టల్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇవి భారతదేశంలోని అన్ని ల్యాండ్‌మార్క్ స్టోర్లలో, మేజర్ రిటైల్ షాపులలో చాలా సరసమైన ధరలకు లభిస్తాయి. క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ ఉన్నందున, సంస్థ ఆఫర్లు, భారీ తగ్గింపులను కూడా అందిస్తోంది.