వెస్టింగ్‌హౌస్ 32-అంగుళాల నాన్-స్మార్ట్ టీవీ ధర రూ.7,999. అయితే 43-అంగుళాల అల్ట్రా HD అంటే 4K TV ధర రూ. 20,999, 50-అంగుళాల 4K మోడల్ ధర రూ. 27,999.
యూఎస్ బ్రాండ్ వెస్టింగ్‌హౌస్ (westinghouse) ఒకేసారి మూడు కొత్త స్మార్ట్ టీవీలను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గతేడాది కూడా వెస్టింగ్‌హౌస్ ఇండియాలో నాన్-స్మార్ట్ అండ్ స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ 32 అంగుళాలు, 43 అంగుళాలు అండ్ 50 అంగుళాల మూడు టీవీలను తీసుకొచ్చింది, వీటి ప్రారంభ ధర రూ.7,999. వెస్టింగ్‌హౌస్ కొత్త టీవీకి సంబంధించి బెస్ట్ పిక్చర్ క్వాలిటీ, మంచి సౌండ్, స్మార్ట్ ఫీచర్‌లను అందిస్తుందని క్లెయిమ్ చేసింది. వెస్టింగ్‌హౌస్ బ్రాండ్ లైసెన్స్‌తో అతిపెద్ద దేశీయ టీవీ తయారీ సంస్థ SPPL, వెస్టింగ్‌హౌస్ ఈ టీవీని ప్రారంభించింది.
వెస్టింగ్‌హౌస్ టీవీల ధర
వెస్టింగ్‌హౌస్ 32-అంగుళాల నాన్-స్మార్ట్ టీవీ ధర రూ.7,999. అయితే 43-అంగుళాల అల్ట్రా HD అంటే 4K TV ధర రూ. 20,999, 50-అంగుళాల 4K మోడల్ ధర రూ. 27,999. జూన్ 13 నుండి అంటే నేటి నుండి అమెజాన్ ఇండియా నుండి ఈ టీవీల సేల్స్ ప్రారంభమవుతుంది.
undefined
వెస్టింగ్‌హౌస్ టివి స్పెసిఫికేషన్‌లు
32-అంగుళాల మోడల్ HD రిజల్యూషన్‌తో LED స్క్రీన్‌ను పొందుతుంది. ఈ టీవీకి 2 HDMI, 2 USB పోర్ట్‌లు లభిస్తాయి. ఇంకా 20W సామర్థ్యంతో రెండు స్పీకర్లు ఇచ్చారు. టీవీ డిజిటల్ నాయిస్ ఫిల్టర్‌తో కూడా వస్తుంది ఇంకా ఆటోమేటిక్ గా వాల్యూమ్ లెవెల్ అడ్జస్ట్ చేస్తుంది. ఈ టివి స్క్రీన్ బ్రైట్‌నెస్ 350 నిట్స్.
43-అంగుళాల UHD/4K, 50-అంగుళాల UHD/4K స్మార్ట్ టీవీలు 2జిబి ర్యామ్, 8జిబి స్టోరేజ్ అండ్ 3 HDMI పోర్ట్‌లతో పాటు 2 USB పోర్ట్‌లతో వస్తాయి. HDR10, Chromecast కూడా టీవీతో సపోర్ట్ చేస్తుంది. రెండు టివిలు 40w సామర్థ్యంతో రెండు స్పీకర్లు ఉంటాయి. స్పీకర్‌తో పాటు సరౌండ్ సౌండ్ కూడా ఉంటుంది.
ఈ రెండు టీవీలలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చారు. గూగుల్ Play Storeకి కూడా సపోర్ట్ చేస్తుంది. టీవీతో పాటు వచ్చే రిమోట్‌లో అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ వంటి యాప్స్ షార్ట్‌కట్ బటన్‌లు కూడా ఉంటాయి. ఈ రెండు టీవీల బ్రైట్‌నెస్ 500 నిట్స్. IPS ప్యానెల్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fiతో గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్ చేస్తుంది.
కొత్త టీవీ లాంచ్ పై సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SPPL) వైస్ ప్రెసిడెంట్ పల్లవి సింగ్ మార్వా మాట్లాడుతూ, “గత సంవత్సరం ఇండియాలో ఐదు మోడళ్లను లాంచ్ చేయడంతో మాకు అపూర్వమైన స్పందన లభిస్తోంది. భారతీయ కస్టమర్లు బడ్జెట్ ధరలో ప్రీమియం బెనెఫిట్స్ పొందుతున్నారు. మా పోర్ట్‌ఫోలియో లిస్ట్ మెరుగుపరచడానికి, అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉండే మూడు కొత్త ఇంకా ప్రీమియం నాన్-స్మార్ట్ అండ్ స్మార్ట్ టీవీలను ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాము అని అన్నారు.