దేశవ్యాప్తంగా రెండులక్షలకు పైగా మొబైల్ టవర్లు తక్కువగా ఉన్నాయి. దీంతో 53% మందికి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కాల్‌డ్రాప్ సమస్య తీవ్రంగా మారిందని అధికార వర్గాలు అంటున్నాయి.
ముంబై: దేశంలో మొబైల్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరుగుతున్నా.. తగినట్లు సాంకేతిక సౌకర్యాలు లభించకపోవడంతో వినియోగదారులకు కష్టాలు తప్పడంలేదు. సెల్యూలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఏఏఐ) పేర్కొన్న గణాంకాల ప్రకారం.. గత మూడేళ్లలో వాట్సాప్ కాల్స్ 141 శాతం పెరిగాయి. కానీ వినియోగదారులకు సేవలను అందించడంలో మాత్రం ఇందుకు తగిన సౌకర్యాలు లేవు.
దేశవ్యాప్తంగా రెండులక్షలకు పైగా మొబైల్ టవర్లు తక్కువగా ఉన్నాయి. దీంతో 53% మందికి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కాల్‌డ్రాప్ సమస్య తీవ్రంగా మారిందని అధికార వర్గాలు అంటున్నాయి. 75శాతం యూజర్స్‌కు వాట్సాప్ కాల్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టెలికం రంగంలో టెక్నాలజీలో పురోగతి సాధించకపోవటం వల్లే కాల్‌డ్రాప్స్ సంఖ్య పెరుగుతున్నదని ట్రాయ్ మాజీ చైర్మెన్ సిద్ధార్థ బెహురా తెలిపారు. యూరప్, పశ్చిమ దేశాల్లో టెలిఫోన్ల విషయంలో ఏ సమస్యలూ తలెత్తవు.
undefined
also read వొడాఫోన్ ఐడియా కస్టమర్లను వెంటాడుతున్న నెట్వర్క్ సమస్య...ఎందుకంటే..?
కానీ భారతదేశంలో టెలికం వినియోగదారులకు రోజుకు రెండుసార్లు కాల్‌డ్రాప్ కష్టాలు ఎదురవుతున్నాయి. ఆపరేటర్స్ సెల్ఫ్ ఆప్టిమైజింగ్ నెట్‌వర్క్స్ ఆప్టోమెటెడ్ నెట్‌వర్క్ ప్లానింగ్ ట్రాల్స్, అప్‌గ్రెడ్ సాఫ్ట్‌వేర్ వినియోగం పెరుగుతున్నదని సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆప్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ వివరించారు.
తాజా పరిస్థితుల్లో భవిష్యత్‌లో వినియోగదారులపై మళ్లీ భారం పడనున్నదని బారతీ ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విఠల్ తెలిపారు. ఇలా వచ్చే ఆదాయంతో కాల్‌డ్రాప్ సమస్యను అధిగమించవచ్చునని తెలిపారు. పట్టణాలు, నగరాల్లో ఉన్న టవర్లను తొలిగించేపనిలో ఆయా టెలికం సంస్థలు నిమగమయ్యాయి. ముంబై వంటి మహానగరాల్లో మౌలిక వసతులు కల్పించటానికి తవ్వకాలు పెద్ద సమస్యగా మారుతున్నదని ఆ సంస్థల ప్రతినిధులు అన్నారు.
కంపెనీల బకాయిలు, జీఎస్టీ భారాలు వెరసి మౌలిక వసతుల కల్పనకు అవసరమైన పెట్టుబడులకు విఘాతం కలుగుతున్నదని చెబుతున్నారు. సాధారణంగా ఒక టవర్ రేంజ్ మరో టవర్ రేంజ్ ఓవర్‌లాప్ అవుతున్నదని బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ జీసీ పాండే తెలిపారు. దీనివల్ల టవర్ల మధ్య సిగ్నలింగ్ వ్యవస్థకు అవరోధం కలుగుతున్నది. అలాంటి సమయంలోనూ కాల్‌డ్రాప్ సమస్యలు ఎక్కువవుతాయని ఆయన వాదన.
సాధారణంగా టవర్లు ఏర్పాటు చేసినప్పుడు మూడు దిశల్లో యాంటినా అమరుస్తారు. ఇలాంటపుడు ఒక యాంటినా వద్ద సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురైనపుడు కాల్‌డ్రాప్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటున్నదని టెలికం రంగ నిపుణులు అంటున్నారు.దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులకు ఏడులక్షల టవర్లు అవసరం కాగా ప్రస్తుతం ఐదులక్షల టవర్లే ఉన్నాయి. సెల్ టవర్ల ఏర్పాటు, తవ్వకాలకు స్థానిక సంస్థలనుంచి ఎదురవుతున్న అడ్డంకులతో త్వరితగతిన టెలికం సేవలు మెరుగుపడటంలేదు.
also read జియోకు అదిరిపోయే షాక్: రూపాయికే 1 జీబీ డేటా....
కొద్దిరోజులుగా వాట్సాప్ కాల్స్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఇది మూడేళ్ల క్రితం కేవలం 365 నిమిషాలు మాత్రమే ఉండేది. కానీ ఇపుడు ఈ రద్దీ 141 శాతం పెరిగింది. ప్రతి యూజర్ నెలకు 11 జీబీ డేటాను వినియోగిస్తున్నాడు. మూడేళ్ల క్రితం ఇది 0.5 జీబీ మాత్రమే ఉండేది.
యావరేజీ రెవెన్యూ (ఏఆర్‌పీయూ) ప్రతి యూజర్ నుంచి రూ.125 వసూలవుతున్నది. రూ.300 వసూలైతే సర్వీసు బాగుంటుందని టెలికం కంపెనీలు అంటున్నాయి. తాజాగా డిసెంబర్ నెలలో టారీఫ్‌ను పెంచాయి. ఇప్పటికే సెల్‌ఫోన్ వాడకం భారమవుతున్నదని సామాన్య, మధ్యతరగతి వినియోగదారులు వాపోతున్నారు.
స్పెక్ట్రం సేవలు కాస్ట్లీగా ఉన్నాయి. విదేశీ సేవలతో పోల్చుకుంటే స్పెక్ట్రం 35 శాతం ఎక్కువ. ఇక్కడి టెలికం ఆపరేటర్లు 35 మెగాహార్జ్స్ స్పెక్ట్రం వినియోగిస్తున్నారు. వాస్తవానికి మెరుగైన సేవలు అందించాలంటే 400 మెగాహెర్జ్స్ స్పెక్ట్రం అవసరమని టెలికం రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రతి కాల్‌కు జియో 97.2 శాతం సమయం తీసుకుంటే, ఎయిర్‌టెల్ 89.2, ఐడియా 77.4, వోడాఫోన్ 76.9 శాతం టైం పొందుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో విడుదలైన 2019 ఆగస్టు వాట్సాప్ కాల్ డ్రాప్ రిపోర్టు ప్రకారం 90 సెకన్లకు 95 శాతం కాల్స్ కలవాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.