నిరుద్యోగులకు గుడ్ న్యూస్... క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల కొత్తగా 2.4 లక్షల ఉద్యోగాలు...

By Sandra Ashok Kumar  |  First Published Feb 8, 2020, 12:04 PM IST

క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల 2023 నాటికి 100 బిలియన్ డాలర్ల ఆదాయం, 2.4 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని గూగుల్​ క్లౌడ్​-బీసీజీ ఉమ్మడి నివేదిక తెలిపింది. భారత్​లో పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థ అమలు చేయడంలో ప్రభుత్వ నిబంధనలు పలు సంక్లిష్టతలకు కారణం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 
 


న్యూఢిల్లీ: పబ్లిక్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థను అమలుచేయడం వల్ల 2023 నాటికి భారత ఆర్థికవ్యవస్థకు సుమారు 100 బిలియన్​ డాలర్ల (రూ. 7.12 లక్షల కోట్లు) మేర ఆదాయం సమకూరుతుందని గూగుల్​ క్లౌడ్​-బీసీజీ ఉమ్మడి నివేదిక తెలిపింది. అలాగే ప్రత్యక్షంగా 2.4 లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా 7,43,000 ఉద్యోగాలు కూడా కల్పించవచ్చని పేర్కొంది.

వార్షికంగా భారత జీడీపీలో 0.6 శాతం అని గూగుల్​ క్లౌడ్​-బీసీజీ ఉమ్మడి నివేదిక పేర్కొన్నది. ప్రత్యక్షంగా లభించే 2,40,000  ఉద్యోగాల్లో 1,57,000 మంది డేటా సైంటిస్టులు, ఉత్పత్తి నిర్వాహకులు, ఇంజినీరింగ్, డిజైన్​, యూజర్ ఎక్స్​పీరియన్స్ అండ్ క్లౌడ్​ సర్వీస్ ప్రొవైడర్లు, ఐటీ సర్వీస్ ప్రొవైడర్లుగా ఉంటారని నివేదిక పేర్కొంది. 

Latest Videos

also read వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా అయితే మీకో గుడ్ న్యూస్...

మౌలిక సదుపాయాల నిర్వహణలోనూ ఉద్యోగాలు, డిజిటల్, టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాలు లభిస్తాయని గూగుల్​ క్లౌడ్​-బీసీజీ ఉమ్మడి నివేదిక తెలిపింది. మరో 83 వేల ఉద్యోగాలు ప్రధాన వ్యాపార స్రవంతికి చెందినవని వెల్లడించింది.

లెగసీ డేటా భద్రత విషయంలో ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉన్నాయని, ఫలితంగా క్లౌడ్​లో ఆ డేటాను పొందుపరచడానికి వీలుకావడం లేదని, వ్యవస్థ సంక్లిష్టంగా ఉందని గూగుల్​ క్లౌడ్​-బీసీజీ ఉమ్మడి నివేదిక తెలిపింది. అయితే ఇప్పుడిప్పుడే ఆర్థికసంస్థలు, తయారీదారులు క్లౌడ్ కంప్యూటింగ్​కు మరలడం ప్రారంభమైందని స్పష్టం చేసింది.

also read ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో రారాజుగా ‘ఐఫోన్’:ఆపిల్ కంపెనీదే పై చేయి

గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ మేనేజింగ్ డైరెక్టర్​ రిక్ హర్ష్​మన్​ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సంప్రదాయ చిల్లర వ్యాపారులు ఇప్పుడిప్పుడే ఈ కామర్స్ వైపు మళ్లుతున్నారు. దీపావళి లాంటి ప్రత్యేక అమ్మకాల సమయంలో త్వరగా తమ వస్తువులను సేల్​ చేయడానికి పబ్లిక్ క్లౌడ్ వైపు మొగ్గుచూపుతున్నారు’ అని తెలిపారు. 

'క్లౌడ్​ బేస్డ్ స్మార్ట్ డేటా అనలిటిక్స్ సొల్యూషన్స్ వల్ల చిల్లర వ్యాపారులు.. వినియోగదారుల అభిరుచులు తెలుసుకోగలగడంతోపాటు వాటిని అందించగలుగుతున్నారు. అలాగే తమ ఉత్పత్తుల జాబితాను సమర్థవంతంగా నిర్వహించుకుని ఖర్చులను తగ్గించుకుంటున్నారు' అని రిక్ హర్ష్​మన్ పేర్కొన్నారు.

click me!