జియోకు అదిరిపోయే షాక్: రూపాయికే 1 జీబీ డేటా....

By Sandra Ashok Kumar  |  First Published Feb 10, 2020, 10:23 AM IST

బెంగళూరుకు చెందిన స్టార్టప్ 'వై-ఫై డబ్బా' కేవలం రూపాయికే ఒక జీబీ సూపర్ ఫాస్ట్ వైఫై డేటాను అందిస్తోంది. ఇది దిగ్గజ టెలికం సంస్థలు కూడా ఊహించని తగ్గింపు. ప్రస్తుతం బెంగళూరుకు మాత్రమే పరిమితమై సేవలు అందిస్తున్న ‘వై-ఫై డబ్బా’.. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లోనూ తన సేవలను విస్తరించాలని భావిస్తోంది.


న్యూఢిల్లీ: భారత్ టెలికం రంగాన్ని షేక్ చేస్తున్న ప్రైవేట్ టెలికం ప్రొవైడర్ రిలయన్స్ జియోకు ఓ స్టార్టప్​ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న స్టార్టప్​ 'వైఫై డబ్బా'.. కేవలం ఒక్క రూపాయికే ఒక జీబీ సూపర్​ఫాస్ట్ వైఫై, ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది.భారత టెలికం రంగంలోకి జియో ఎంట్రీతో డేటా ధరలు అమాంతం దిగి వచ్చాయి. ఇతర టెలికం దిగ్గజ సంస్థలు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కూడా పోటాపోటీగా డేటా ధరలు తగ్గిస్తూ వచ్చాయి.

టెలికం వినియోగదారులను ఆకట్టుకోవడానికి తక్కువ ధరకే ఎక్కువ డేటాను అందిస్తున్నాయి. ఇప్పుడు వైఫై డబ్బా అనే చిన్న స్టార్టప్ ఈ టెలికం దిగ్గజాలకు భారీ ఛాలెంజ్ విసిరింది.బెంగళూరులో 2016లో వై-ఫై డబ్బా స్టార్టప్ ప్రారంభమైంది. తక్కువ ఖరీదైన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్​పీ) ఒక జీబీపీఎస్​ హైస్పీడ్​తో ప్రీపెయిడ్ ప్లాన్ల కింద కేవలం ఒక్క రూపాయికే ఒక జీబీ డేటాను అందిస్తోంది. వ్యక్తిగత కస్టమర్లు, కార్పొరేట్ కస్టమర్లకు కూడా సేవలు అందించడానికి వై-ఫై డబ్బా స్టార్టప్ అందుబాటులో ఉంది. 

Latest Videos

also read నిరుద్యోగులకు గుడ్ న్యూస్... క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల కొత్తగా 2.4 లక్షల ఉద్యోగాలు...

2020లో మొత్తం 100 సూపర్ నోడ్స్ వైఫై నెట్​వర్క్​ను బెంగళూరు అంతటా విస్తరించాలని వై-ఫై డబ్బా భావిస్తోంది. వాస్తవంగా ఇతర కేబుల్ నెట్​వర్క్ మాదిరిగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ దీనికి అవసరంలేదు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకించి స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సిన పనీలేదు. ఇందులో ఉపయోగించిన టెక్నాలజీ వల్ల ఎలాంటి జాప్యం లేకుండా రెండు కి.మీ దూరం వరకు కమ్యునికేట్ చేయగలవు.

సూపర్​ నోడ్ దాని చుట్టూ ఉన్న పరిస్థితులను పర్యవేక్షించడానికి వాతావరణ సెన్సార్, సీసీటీవీ కూడా ఉంటాయి. ప్రారంభంలో థర్డ్​పార్టీ హార్డ్​వేర్, సాఫ్ట్​వేర్​పై ‘వై-ఫై డబ్బా’ ఆధారపడింది. ఇప్పుడు సొంతంగా సాఫ్ట్​వేర్ నెట్​వర్కింగ్​ను అభివృద్ధి చేసుకుంది.అంతే కాదు ప్రస్తుతం బెంగళూరులో వర్చువల్ టోపోలాజీ మ్యాప్​ను రూపకల్పనలో వై-ఫై డబ్బా నిమగ్నమై ఉంది. దీని వల్ల సూపర్​నోడ్​లను ఇన్​స్టాల్​ చేయడానికి అనుకూలమైన లొకేషన్​ను సులభంగా ఎంచుకోవచ్చు.

ప్రస్తుతం వైఫై డబ్బా బెంగళూరులో పదివేల ప్రదేశాల్లో 1000 హాట్​స్పాట్​లు నిర్వహిస్తోంది. కేవలం రెండు రూపాయలకే 200 ఎంబీ కూడా అందిస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలోని మూడవ శ్రేణి, నాల్గవ శ్రేణి పట్టణాల్లో తమ సేవలను విస్తరించాలని లక్ష్యం పెట్టుకుంది.వైఫై డబ్బా నెట్​వర్క్ ప్రస్తుతం బెంగళూరు నగర వాసులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆసక్తి గల వినియోగదారులు కంపెనీ వెబ్​సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఆన్​లైన్​లో వైఫై డబ్బా టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. స్థానికంగానూ ‘వై-ఫై డబ్బా’ టోకెన్లు కొనుగోలు చేయవచ్చు.

also read వాట్సాప్‌ ఉపయోగిస్తున్నారా అయితే మీకో గుడ్ న్యూస్...

ఇంటర్నెట్ వాడే వారి కళ్లు సురక్షితంగా ఉండేలా లేజర్ టెక్నాలజీతో సూపర్ నోడ్స్ తయారు చేసింది. రెండు కిలోమీటర్ల దూరం వరకు ఈ సూపర్ నోడ్స్ పని చేస్తాయి. వై-ఫై డబ్బా సీఈఓ కరమ్ లక్ష్మణ్ మాట్లాడుతూ వ్యయం ఎంతన్న సంగతి పక్కనబెడితే సూపర్ నోడ్స్ విప్లవాత్మక పరిణామం, కానీ టెక్నాలజీ వారసత్వాన్ని ధరల్లో పోల్చలేమన్నారు. 

ఫైబర్ అనేది ఐఎస్పీ ఫ్రెటర్నిటీకి కీలకం అని, కానీ పర్యావరణం ద్రుష్టితో పోలిస్తే చాలా వ్యయ భరితం అని కరం లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. కానీ సంప్రదాయ ఫైబర్ నెట్ వర్క్ తో పోలిస్తే సూపర్ నోడ్స్ ఏర్పాటు కోసం పదో వంతు ఖర్చు చేస్తే సరిపోతుందన్నారు. వినియోగదారులకు ఇంటర్నెట్ చౌకగా అందజేయడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నట్లు కరం లక్ష్మణ్ తెలిపారు. వై-ఫై డబ్బా సొంతంగా ఇన్ హౌస్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, నెట్ వర్కింగ్ డెవలప్ చేసుకున్నది. 

click me!