తమిళనాడు ఎన్నికలు: డీఎంకే తొలి జాబితా విడుదల.. బరిలోకి ఉదయనిధి స్టాలిన్

Siva Kodati |  
Published : Mar 12, 2021, 02:39 PM IST
తమిళనాడు ఎన్నికలు: డీఎంకే తొలి జాబితా విడుదల.. బరిలోకి ఉదయనిధి స్టాలిన్

సారాంశం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష డీఎంకే శుక్రవారం తమ తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ కొలతూర్యోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష డీఎంకే శుక్రవారం తమ తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ కొలతూర్యోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఆయన కుమారుడు, యువజన విభాగం నేత, సినీహీరో ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో డీఎంకే ఓ ఇంటర్వ్యూను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పార్టీ మాజీ అధ్యక్షుడు కరుణానిధి కాలంలోనూ ఈ ప్రక్రియ కొనసాగింది.

ఆ సమయంలో కరుణానిధి బృందం ముందు స్టాలిన్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇప్పటికీ కూడా డీఎంకేలో ఇదే ఆనవాయితీ నడుస్తోంది. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఇంటర్వ్యూకు హాజరయ్యారు.

ఈ సమయంలోనే ఉదయనిధి స్టాలిన్‌ను పార్టీ పక్కన పెట్టిందని, ఆయన ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. కానీ చివరకు అభ్యర్ధుల జాబితాలో ఉదయనిధి స్టాలిన్ చోటు దక్కించుకున్నారు.

మరోవైపు సీనియర్లకు మొదటి జాబితాలో చోటు కల్పించారు స్టాలిన్. కీలక నేతలు కే.ఎన్. నెహ్రూ త్రిచీ నుంచి, సెంథిల్ బాలాజీ కరూర్ నుంచి, టీఆర్‌బీ రాజా మన్నార్ గూడి నియోజకవర్గం నుంచి, తంగా తమిళ్ సెల్వన్ బోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

తమిళనాడు సీఎంగా స్టాలిన్: ఈ నెల 7న ప్రమాణం
వారసత్వం: జయలలిత కంచుకోటలో విజయం ఆయనదే..