తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: దినకరన్‌ పార్టీతో ఎంఐఎం దోస్తీ

By narsimha lodeFirst Published Mar 9, 2021, 4:57 PM IST
Highlights

 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దినకరన్ పార్టీ(ఏఎంఎంకే)తో ఎంఐఎం జట్టు కట్టింది, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రావడంతో తమిళనాడులో కూడ పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయం తీసుకొంది.


చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దినకరన్ పార్టీ(ఏఎంఎంకే)తో ఎంఐఎం జట్టు కట్టింది, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రావడంతో తమిళనాడులో కూడ పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయం తీసుకొంది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఐదు స్థానాల్లో విజయం సాధించింది. లౌకిక ఓట్లను ఎంఐఎం చీల్చి పరోక్షంగా బీజేపీ విజయానికి దోహదం చేసిందని  ఆర్జేడీ కూటమి విమర్శలు చేసింది.

234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో మూడు స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయనుంది. వాణియంబాడీ, కృష్ణగిరి, శంకరపురం స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయనుంది.2016లో ఎంఐఎం తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు వకీల్ అమ్మద్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన 6 శాతం ఓట్లను దక్కించుకొని  10 వేల ఓట్లను సాధించారు. 

 

 

ఎంఐఎం తమిళనాడు శాఖ 20 సీట్ల జాబితాను అసద్ కు అందించింది. వానియంబాడీ సీటులో ఈ దఫా కచ్చితంగా విజయం సాధిస్తామని ఎంఐఎం స్థానిక నేతలు ధీమాగా చెప్పారు.అన్నాడిఎంకె, బీజేపీ, పీఎంకెలతో పొత్తు పెట్టుకొంది. డిఎంకె, కాంగ్రెస్, సీపీఐ మరో కూటమిగా పోటీ చేస్తున్నాయి. 

అన్నాడిఎంకె నుండి శశికళను బహిష్కరించడంతో దినకరన్ కొత్త పార్టీని ఏర్పాటు చేసుకొన్నారు.  రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎఎంఎంకె ప్రభావం చూపే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేస్తోంది.

click me!