PM MODI: రెజ్లర్ వినేశ్ పోగట్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పీఎం మోడీ

By team teluguFirst Published Oct 18, 2021, 7:03 PM IST
Highlights

Vinesh Phogat Meets Modi: ప్రముఖ రెజ్లర్ వినేశ్ పోగట్ కు ఇచ్చిన మాటను ప్రధాని మోడీ నిలబెట్టుకున్నారు.  ఈ సందర్భంగా మోదీపై ఆమె ప్రశంసలు కురపించింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM MODI) గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రముఖ రెజ్లర్ (Wrestler) వినేశ్ పోగట్ (Vinesh Phogat), ఆమె కుటుంబసభ్యులతో ఆయన ముచ్చటించారు. సోమవారం వినేశ్ పోగట్.. ఢిల్లీలోని ప్రధాని నివాసం (PMO)లో ఆమె కుటుంబసభ్యులతో కలిసి ప్రధానిని కలిసారు. ఈ సందర్భంగా మోదీపై ఆమె ప్రశంసలు కురపించింది. ఈ సమావేశానికి ఆమె భర్త, తల్లి కూడా హాజరయ్యారు. 

ట్విట్టర్ వేదికగా స్పందించిన పోగట్.. ‘ప్రధాని మోదీ గారితో  గౌరవప్రదమైన సమావేశం జరిగింది. క్రీడల పట్ల ఆయన ఉత్సాహం, ప్రేమ నిజంగా అంతులేనిది. అథ్లెట్ల పట్ల మీకున్న శ్రద్ధ మా గుండెలను హత్తుకుంది. మీకున్న  తీరికలేని షెడ్యూల్ లో కూడా నాకిచ్చిన మాటకోసం (పోగట్ కుటుంబసభ్యులతో కలిసి మాట్లాడుతానని టోక్యో ఒలింపిక్స్ కు ముందు మోదీ పోగట్ కు మాటిచ్చారు) మాకు సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు సార్..’ అని పేర్కొంది. 

 

Great meeting the honourable sir today. His enthusiasm and love for sport is truly boundless. Genuinely touched by your concern for athletes. A big thank you sir for sparing time from your busy schedule to fulfill your promise of interacting with me and my family.🙏 pic.twitter.com/MVll6YrEAp

— Vinesh Phogat (@Phogat_Vinesh)

ఇదిలాఉండగా.. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) లో భారత్ (India) కు పతకం ఖాయం అనుకున్న ఆటగాళ్లలో వినేశ్ ఒకరు. కానీ ఆమె మాత్రం క్వార్టర్స్ లో దారుణ పరాజయాన్ని చవిచూసి నిష్క్రమించింది. అనంతరం ఆమె వైఖరి కారణంగా భారత ఒలింపిక్ అసోసియేషన్ (indian Olympic assosiation) ఆమెకు షోకాజ్ నోటీసులు కూడా పంపింది. వినేశ్ ఇచ్చిన రిప్లైకి సంతృప్తి వ్యక్తం చేసిన అసోసియేషన్.. ఆమెకు ఊరటనిచ్చింది. కానీ ఇటీవల ముగిసిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ అర్హత రౌండ్లలో ఆమె తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. మానసిక సమస్యలతో తాను కుంగిపోయినట్టు ఓటమి అనంతరం వినేశ్ పేర్కొంది. 

ఇవి కూడా చదవండి: T20 WorldCup 2021: జెర్సీ షేర్ చేసిన రోహిత్, షమి.. మళ్లీ అదే ఫలితం రిపీట్ కాబోతుందా..? ఫ్యాన్స్ లో ఆందోళన

Bandula Warnapura: శ్రీలంక తొలి టెస్టు కెప్టెన్ మృతి.. టీ20 క్వాలిఫయింగ్ మ్యాచ్ కు ముందు భారీ షాక్

VVS Laxman: బీసీసీఐ ఇచ్చిన క్రేజీ ఆఫర్ ను తిరస్కరించిన వీవీఎస్ లక్ష్మణ్.. కారణం సన్ రైజర్సేనా..?

click me!