Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్ కు చేరుకున్నారు. అయితే, 50 కేజీల కంటే కొద్ది గ్రాముల బరువు అధికంగా ఉండటంతో వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది.
Vinesh Phogat : భారతదేశ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. మహిళల 50 కేజీల విభాగంలో స్టార్ ప్లేయర్లకు వరుసగా షాకిస్తూ అద్భుత విజయాలు అందుకుంది.
undefined
ఫైనల్ కు చేరుకుని గెలుపోటములతో సంబంధం లేకుండా ఒక మెడల్ ను కన్ఫార్మ్ చేసుకుంది. బుధవారం ఫైనల్ బౌట్ కు ముందు బిగ్ షాక్ తగిలింది. వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది.
50 కేజీల గోల్డ్ మెడల్ బౌట్ లో బరువు కాస్త ఎక్కువగా ఉండటంతో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడింది. దీంతో ఆమె ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగం నుంచి వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడిన వార్తను భారత బృందం విచారంతో పంచుకుందని ఐఓఏ ఒక ప్రకటనలో తెలిపింది. వినేష్ ఫోగట్ బరువును తగ్గించడానికి రాత్రంతా జట్టు ఎంత ప్రయత్నించినా నిరాశే మిగిలిందని తెలిపింది. బుధవారం ఉదయం 50 కిలోలకు పైగా బరువు పెరిగింది.
దీనిపై భారత బృందం పూర్తి వివరాలను ఇంకా అందించలేదు. వినేశ్ ప్రైవసీని గౌరవించాలని భారత జట్టు కోరుతోంది. 50 కేజీల కంటే కొన్ని గ్రాముల బరువు మాత్రమే అధికంగా ఉండటంతో ఆమె ఇలా ఒలింపిక్స్ నుంచి ఔట్ అయ్యారు. కాగా, పారిస్ ఒలింపిక్స్ 2024 లో ఫైనల్ కు చేరుకున్న తర్వాత వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. మరీ ఇప్పుడు ఆమెకు మెడల్ వస్తుందా? రాదా? అనేది ఉత్కంఠను రేపుతోంది.
ఒలింపిక్ గేమ్స్ నిబంధనల ప్రకారం.. అనర్హత వేటు అంటే ఒలింపిక్స్ మొత్తంగా ఆమె ఔట్ అయ్యారని అర్థం. దీని కారణంగా ఆమె మెడల్ రేసులో వుండరు. నిబంధనల ప్రకారం వినేష్ ఫొగాట్ ఇప్పుడు కాంస్య పతకానికి కూడా అర్హత సాధించలేరు. ఫైనల్ లో ఆమె ప్రత్యర్థి అయిన అమెరికాకు చెందిన సారా హిల్డెబ్రాండ్ కు బంగారు పతకాన్ని గెలుచుకుంటారు. మహిళల 50 కేజీల పోడియంలో ఒక స్వర్ణ పతక విజేతతో పాటు ఇద్దరు కాంస్య పతక విజేతలు ఉంటారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.