
Vinesh Phogat : భారతదేశ స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. మహిళల 50 కేజీల సెమీ ఫైనల్‌లో వినేశ్ 5-0తో క్యూబాకు చెందిన ఉస్నేలిస్ గుజ్‌మన్ లోపెజ్‌పై విజయం సాధించింది. అయితే, అప్పుడు ఆమెపై అనర్హత వేటు పడింది. 50 కేజీల గోల్డ్ మెడల్ బౌట్ లో బరువు కాస్త ఎక్కువగా ఉండటంతో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడింది.
నిబంధనల ప్రకారం అధిక బరువు క్రమంలోనే అనర్హత వేటు వేస్తున్నట్టు ఒలింపిక్ కమిటీ తెలిపింది. మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగం నుంచి వినేశ్ ఫోగట్ పై అనర్హత గురించి భారత బృందం విచారంతో పంచుకుందని ఐఓఏ ఒక ప్రకటనలో తెలిపింది. రాత్రంతా జట్టు ఎంత ప్రయత్నించినా ఆమె ఈ రోజు ఉదయం (బుధవారం) 50 కిలోల కంటే అధిక బరువు పెరిగింది. దీనిపై భారత బృందం పూర్తి వివరాలను ఇంకా అందించలేదు. వినేశ్ ప్రైవసీని గౌరవించాలని భారత జట్టు కోరుతోంది. 50 కేజీల కంటే కొన్ని గ్రాముల బరువు మాత్రమే అధికంగా ఉండటంతో ఆమె ఇలా ఒలింపిక్స్ నుంచి ఔట్ అయ్యారు.
కాగా, పారిస్ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగాట్ అద్భుత పోరాట ప్రదర్శనతో ఫైనల్స్ వరకు ప్రయాణించారు. అద్భుతమైన నైపుణ్యం, పోరాట సంకల్పాన్ని ప్రదర్శించారు. మంగళవారం ఆమె సెమీఫైనల్లో క్యూబాకు చెందిన యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్‌పై 5-0తో సునాయాసంగా విజయం సాధించింది. దీంతో దాదాపు ఒక మెడల్ ను ఖాయం చేసుకుంది. ఫైనల్ లో గెలిస్తే గోల్డ్ మెడల్ దక్కేది. ఓడినా రజత పతకంతో నిలిచేది. ఈ ఒలింపిక్స్ లో ప్రపంచ చంపియన్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ జపాన్‌కు చెందిన యుయి సుసాకి, ఉక్రెయిన్ ఎనిమిదో సీడ్ ఒక్సానా లివాచ్‌ను కూడా ఓడించి చరిత్ర సృష్టించింది వినేష్ ఫోటగ్. గత రెండు ఒలింపిక్స్, రియో 2016, టోక్యో 2020లలో క్వార్టర్-ఫైనల్ వరకు చేరుకుంది.