సెమీస్ ముందు టీమిండియాపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన కివీస్ మాజీ కెప్టెన్ .. ఇంతకీ ఏమన్నారంటే..?

By Rajesh Karampoori  |  First Published Nov 13, 2023, 10:38 PM IST

India vs New Zealand Semifinal: ప్ర‌పంచ‌క‌ప్‌ 2023లో భారత జట్టు జైత్రయాత్ర కొన‌సాగుతోంది. లీగ్ దశలో 9 మ్యాచ్ లకు 9 మ్యాచ్ లు గెలిసి.. సెమీస్ లో అడుగుపెట్టింది. సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుండగా కివీస్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ కీలక వ్యాఖ్యలు చేశారు.  


India vs New Zealand Semifinal: ప్ర‌పంచ‌క‌ప్‌ 2023లో భారత జట్టు జైత్రయాత్ర కొన‌సాగుతోంది. లీగ్ దశలో మొత్తం 9 మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఇండియా .. ఈ టోర్నీలో ఓట‌మి ఎగుర‌ని జ‌ట్టుగా  నిలిచి సెమీస్ లోకి అడుగుపెట్టింది. కాగా.. బుధవారం న్యూజిలాండ్‌తో సెమీ-ఫైనల్ ఆడనుంది. టైటిల్ గెలవడానికి కేవలం రెండు అడుగుల దూరంలో రోహిత్ సేన ముంబైలోని వాంఖడేలో కివీస్‌తో తలపడనుంది. ఈ తరుణంలో   2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌ను గుర్తు చేసుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం ఓటమి పాలైన టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటోందని భారత అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 ఈ తరుణంలో కివీస్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతుండగా భారత్ ఆందోళనకు గురవుతుందని రాస్ టేలర్ అభిప్రాయపడ్డాడు. నాలుగు సంవత్సరాల క్రితం.. న్యూజిలాండ్ వర్షం ప్రభావిత సెమీ-ఫైనల్‌లో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో 2019 ప్రపంచ కప్‌ టోర్నీ నుంచి భారత్ వెనుదిరాగాల్సివచ్చింది. 

Latest Videos

undefined

2019 వరల్డ్ కప్ లో లాగేనే.. ఈసారి కూడా లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి భారత్ సెమీఫైనల్‌కు చేరుకుందనీ,  ఆ టోర్నీలో శుభారంభం చేసిన న్యూజిలాండ్ 9 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో 10 పాయింట్లతో లీగ్ దశలో నాలుగో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు చేరుకుందని , కానీ చివరికి మాంచెస్టర్‌లో జరిగిన సెమీ-ఫైనల్స్‌లో న్యూజిలాండ్  చేతిలో ఓడిపోయిందని తెలిపాడు. గత వరల్డ్ కప్ లో కూడా న్యూజిలాండ్ కాస్త కష్టపడి సెమీస్ చేరిందని రాస్ టేలర్ వివరించాడు.  

ఈ సారి టీమిండియా గతంలో కంటే మరింత పెద్ద ఫేవరెట్ టీమ్ గా బరిలో ఉందని, అలాగే, టీమిండియా తన సొంతగడ్డపై ఆడుతుందని అన్నారు. లీగ్ దశలో  టీమిండియా చాలా బాగా ఆడిందనీ, కాబట్టి టీమిండియాపైనే ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నాడు. ఈ టోర్నీలో కివీస్ ఓడిపోయినా.. పోయేదేమీ లేదనీ, న్యూజిలాండ్ జట్టు ఎప్పుడూ  ప్రమాదకరమైన జట్టేనని అన్నారు. ఎప్పుడైనా టీమిండియా భయపడుతుంటే.. ఆ జట్టు న్యూజిలాండ్ తో తలపడుతున్నట్టు అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. 

మాజీ వెటరన్ బ్యాట్స్‌మెన్ ఇంకా మాట్లాడుతూ సెమీస్ లో న్యూజిలాండ్ ఎలా ఆడాలో కూడా  చెబుతున్నాడు. ఆరంభంలోనే వికెట్లు తీస్తే టీమిండియా మిడిలార్డర్ పై తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుందని, మొదటి 10 ఓవర్లలో రెండు లేదా మూడు వికెట్లు పడగొడితే టీమిండియాను చాలా సులభంగా నియంత్రించవచ్చని అన్నాడు. ఎందుకంటే.. టీమిండియాలో మొదటి ముగ్గురు మాత్రమే అద్భుతంగా ఆడుతున్నారని తెలిపాడు. అలాగే.. ఈ మ్యాచ్ గెలుపులో టాస్ కీలకం అవుతుందని, టీమిండియాపై న్యూజిలాండ్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  

click me!