World Cup 2023: సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనున్న టీమిండియా.. మరీ ఆనాటి ప్రతీకారం తీర్చుకునేనా..? 

Published : Nov 13, 2023, 07:28 PM IST
World Cup 2023: సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనున్న టీమిండియా.. మరీ ఆనాటి ప్రతీకారం తీర్చుకునేనా..? 

సారాంశం

India vs New Zealand: ప్రపంచ కప్ 2023 మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై టీమిండియా ప్రతికారం తీర్చుకుంటుందా..? ఫైనల్ లో అడుగుపెట్టేనా ? 

India vs New Zealand: ప్రపంచ కప్ 2023 మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ భారత్,న్యూజిలాండ్ మధ్య నవంబర్ 15 న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. ప్రపంచ కప్ 2019 సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను న్యూజిలాండ్ ఓడించడంతో ఆ టోర్నీ నుంచి భారత్‌ నిష్క్రమించింది. దీంతో వర్డల్ కప్ పై ఆశలు గల్లంతయ్యాయి.

గతంతో పోల్చితే.. ప్రస్తుతం టీమిండియా చాలా పఠిష్టంగా ఉంది. అటు బ్యాటింగ్ లోనూ.. బౌలింగ్ లోనూ టీమిండియా మంచి ఫామ్ లో ఉంది. టీమిండియాలో ప్రతి ఆటగాడు రాణిస్తున్నాడు. కాగా న్యూజిలాండ్ ను కూడా తక్కువ అంచన వేయడానికి వీలు లేదు. రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ వంటి ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారు.  

వాస్తవానికి 2019 సెమీ-ఫైనల్స్‌లో  18 పరుగుల తేడాతో భారత్‌ను న్యూజిలాండ్ ఓడించింది. ఈ ఓటమితో టీమ్ ఇండియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. దీంతో ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది. ఇప్పుడు భారత్‌కు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది.

ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గతసారి కూడా టోర్నీలో తొలి సెమీఫైనల్ మ్యాచ్ కాగా, ఈసారి కూడా ఇదే తొలి సెమీఫైనల్ మ్యాచ్ కావడం విశేషం. చివరిసారిగా తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 239 పరుగులు చేసింది. తర్వత లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 221 పరుగులకు ఆలౌటైంది. భారత్ తరఫున రవీంద్ర జడేజా 77 పరుగులు చేయగా..మహేంద్ర సింగ్ ధోనీ 50 పరుగులు చేశాడు.

ఈ ప్రపంచకప్‌లో సెమీస్‌లో విజయం సాధించడం టీమిండియాకు అంత సులువు కాదు. ఈసారి భారత్ 9 మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది. అయితే సెమీ ఫైనల్‌లో గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. న్యూజిలాండ్ యువ బ్యాట్స్‌మెన్ రచిన్ రవీంద్ర అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 9 మ్యాచ్‌ల్లో 565 పరుగులు చేశాడు. అతను టీమ్ ఇండియాకు టెన్షన్ పెడుతున్నాడు. న్యూజిలాండ్‌ బ్యాటింగ్  ఆర్డరే కాకుండా.. బౌలింగ్ ఆర్డర్  కూడా దుమ్మురేపుతోంది. ఈ సమస్యలను అధిగమిస్తే..టీమిండియా గెలుపు సులభమే..  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: హార్దిక్ పాండ్యా ఊచకోత.. 16 బంతుల్లోనే ఫిఫ్టీ, బద్దలైన రికార్డులు ఇవే!
IND vs SA: గిల్ అవుట్.. శాంసన్ ఇన్.. వచ్చీ రాగానే రికార్డుల మోత, కానీ అంతలోనే..