Rachin Ravindra: రచిన్ రవీంద్ర పేరు వెనుక ఇంట్రెస్టింగ్ సోర్టీ ! కానీ, అందులో నిజం లేదంట..

By Rajesh Karampoori  |  First Published Nov 13, 2023, 9:07 PM IST

Rachin Ravindra: టీమిండియాతో న్యూజిలాండ్‌ సెమీస్‌లో ఆడేందుకు సిద్దమవుతోంది. ఆ జట్టులో ఓ యంగ్ ప్లేయర్ దుమ్మురేపుతునాడు. అతనే రచిన్‌ రవీంద్ర. తాజాగా రచిన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర సోర్టీ తెగ వైరల్ అవుతోంది. ఈ సోర్టీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


Rachin Ravindra: వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ యువ ఆటగాడు, ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. తనదైన ఆటతీరుతో క్రికెట్ ప్రేమికులను తన వైపు తిప్పకున్నారు. వరల్డ్ కప్ మెగా టోర్నీలో ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్ లు ఆడిన రచిన్ మూడు మూడు సెంచరీలు, రెండు అర్థ సెంచరీలతో మొత్తం 565 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. 

ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్ మెన్ గా నిలిచారు. దీంతో ఈ ఆటగాడు న్యూజిలాండ్ జట్టులో కీలకంగా మారారు. ఇదే విధంగా సెమీ ఫైనల్స్‌లో కూడా రచిన్‌ రాణించాలని న్యూజిలాండ్ కోరుకుంటోంది. న్యూజిలాండ్‌ సెమీస్‌ పోరులో భారత్‌తో తలపడనుంది. ఈ నెల 15వ తేదీన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. 

Latest Videos

ఈ తరుణంలో భారతి సంతతి చెందిన రచిన్ రవీంద్రకు బయోడేటా గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. అయితే.. గత కొంత కాలంగా ఆ క్రికెటర్ పేరు వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెగ వైరల్ అవుతోంది.  అయితే.. ఆ సోర్టీలో వాస్తవం లేదని రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తికి తెలిపారు. ఇంతకీ ఆ క్రికెటర్ పేరు వెనుక ఉన్న సోర్టీ ఏంటీ ? ఆ సోర్టీని రచిన్ తండ్రి ఖండించడానికి గల కారణాలేంటంటే..?  

ఆ కథ అవాస్తవం.. !

రచిన్ రవీంద్ర భారత సంతతి చెందిన క్రికెటర్ అనే విషయం తెలిసిందే. రచిన్ తల్లిదండ్రులు భారత్ నుంచి న్యూజిలాండ్ కు వలస వెళ్లారు. రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి బెంగళూరు వాసి. తల్లి దీప. వీరిద్దరూ  ఉపాధి కోసం 1990ల్లో బెంగళూరు నుంచి న్యూజిలాండ్ వెళ్లారు. వీరికి రచిన్ అక్కడే జన్మించాడు. రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తికి  క్రికెట్ అంటే.. విపరీతమైన అభిమాని. భారత దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్ అంటే రచిన్ తండ్రికి అమితమైన ఇష్టం. ఆ ఇష్టంతోనే తన కొడుక్కి ఆ దిగ్గజ పేర్లు కలిసొచ్చేలా.. రాహుల్ ద్రవిడ్ పేరులోని రా(RA), సచిన్ పేరులోని చిన్ (Chin) కలిపి రాచిన్ (Rachin) అని పేరు పెట్టారని ప్రచారం.

అయితే.. రాచిన్ తండ్రి ఆ వాదనలను ఖండించారు. గత కొన్ని సంవత్సరాల క్రితమే.. తాను ఈ విషయాన్ని గ్రహించారని పేర్కొన్నారు. తమ కొడుకు పుట్టినప్పుడు.. తన భార్యనే రాచిన్ అనే పేరును సూచించిందనీ, ఈ పేరుపై తమ మధ్య చాలా కాలం చర్చ జరిగిందని .. కొంత కాలం తరువాత పేరు బాగానే ఉందనీ, ఉచ్చరించడం సులభం, చిన్నది ఉందని, ఆ పేరుతోనే తన అబ్బాయిని పిలువాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పేరు భారత దిగ్గజ క్రికెటర్లు రాహుల్,సచిన్ పేర్ల కలయిక అని తాము గ్రహించామని పేర్కొన్నారు. తన బిడ్డను క్రికెటర్‌గా చేయాలనే ఉద్దేశ్యంతో ఆ పేరు పెట్టలేదని రవి కృష్ణమూర్తి ఓ మీడియా సంస్థతో తెలిపారు.  

click me!