విండీస్ ప్లేయర్స్ కి కలిసొచ్చిన భారత పర్యటన: భారీ రేటు పలికిన ప్లేయర్స్

Ashok Kumar   | Asianet News
Published : Dec 19, 2019, 06:57 PM ISTUpdated : Dec 19, 2019, 06:59 PM IST
విండీస్ ప్లేయర్స్ కి కలిసొచ్చిన భారత పర్యటన: భారీ రేటు పలికిన ప్లేయర్స్

సారాంశం

భారత్ తోని సిరీస్ లో ఇరగదీసిన విండీస్ ప్లేయర్స్ ఒక రేంజ్ రేట్ కి అమ్ముడవుతున్న బౌలింగ్ విభాగంలో చాలాబాగా రాణించిన షెల్డన్ కాట్రల్ అనూహ్యంగా 8 కోట్ల 50 లక్షలు చెల్లించి దక్కించుకున్నారు. అతని బిడ్డింగ్ జరుగుతున్నంతసేపూ అందరూ బిడ్డింగ్ కోసం ఆసక్తి చూపారు.

భారత పర్యటన విండీస్ ప్లేయర్స్ కి బాగా కలిసివచ్చినట్టుగా కనపడుతుంది. భారత్ తోని సిరీస్ లో ఇరగదీసిన విండీస్ ప్లేయర్స్ ఒక రేంజ్ రేట్ కి అమ్ముడవుతున్న. బౌలింగ్ విభాగంలో చాలాబాగా రాణించిన షెల్డన్ కాట్రల్ అనూహ్యంగా 8 కోట్ల 50 లక్షలు చెల్లించి దక్కించుకున్నారు. అతని బిడ్డింగ్ జరుగుతున్నంతసేపూ అందరూ బిడ్డింగ్ కోసం ఆసక్తి చూపారు. 

also read పాపం ఉనద్కత్: 5 కోట్ల నష్టం... పాత జట్టుకే

ఎట్టకేలకు డబ్బులు అధికంగా ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అతన్ని ఎనిమిదిన్నర కోట్లు వెచ్చించిమరీ దక్కించుకుంది. ఈ 30యేండ్ల కరీబియన్ ఆటగాడికి ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఇకమారో స్టార్ వెస్ట్ ఇండీస్ బాట్స్మన్ షిమ్రోను హెట్ మేయర్ పేరు ఎప్పుడైతే బిడ్డింగ్ కోసం బయటకు వచ్చిందో...ఒక్కసారిగా హాల్ అంతా అలెర్ట్ అయ్యింది.

అందరూ కూడా అతగాడిని దక్కించుకోవడం కోసం తీవ్రంగా పోటీపడ్డారు. చివరాఖరకు అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7కోట్ల 75 లక్షలు వెచ్చించి దక్కించుకుంది. గత సంవత్సరం షిమ్రోను హెట్ మేయర్ ను రాయల్ ఛాలంజర్స్ జట్టు 4.2 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్లో అతగాడి ప్రదర్శన అంత గొప్పగా లేదు. 5 మ్యాచుల్లోనూ కలిపి అతడు స్కోర్ చేసింది కేవలం 90 పరుగులు మాత్రమే. ఈ నేపథ్యంలో అతడిని ఆర్సీబీ జట్టు రిలీజ్ చేసింది. 

also read IPL చరిత్రలో అత్యధిక ధర పలికింది వీరే

భారత పర్యటనలో షిమ్రోను హెట్ మేయర్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ జట్టు ఒక పెద్ద తప్పు చేసిందనే చెప్పవచ్చు. ఈ అంది వచ్చిన అవకాశాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అందిపుచ్చుకుంది. అతగాడిని దక్కించుకుంది. 
ఇక యంగ్ బౌలర్ అల్జారీ జోసెఫ్ అమ్ముడుపోలేదు. మరో బిగ్ హిట్టర్ కార్లోస్ బ్రాత్వయిట్ కూడా అమ్ముడవ్వకపోవడం విశేషం.

ఈ నేపథ్యంలో పెర్ఫామెన్స్ ఆధారనగానే ప్లేయర్స్ ని కొన్నట్టుగా మనకు అర్త్ర్హమవుతుంది ఏవైనా లెవీస్ కూడా అమ్ముడవ్వలేదు. కీపర్ షై హోప్ ని కూడా ఎవ్వరు కొనకపోవడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన స్టార్ ప్లేయర్ !
IND vs SA : టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలివే.. గంభీర్ దెబ్బ !