పాపం ఉనద్కత్: 5 కోట్ల నష్టం... పాత జట్టుకే

By Sandra Ashok KumarFirst Published Dec 19, 2019, 6:03 PM IST
Highlights

రాజస్థాన్ రాయల్స్ వేసిన ఒక పాచిక ఎంచక్కా పారి వారికి దాదాపుగా 5కోట్ల లాభాన్ని ఆర్జించిపెట్టింది. జయదేవ్ ఉనద్కత్ ని గత ఐపీఎల్ వేలంలో 8కోట్ల 50 లక్షల భారీ మొత్తాన్ని వెచ్చించి రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అతగాడిని ఉంచుకుంటే దాదాపుఆ 8 కోట్లు ఆగిపోతున్నాయని అతడిని రిలీజ్ చేసింది.

కోల్కతా: ఐపీఎల్ వేలం నడుస్తున్నవిషయం మనందరికీ తెలిసిందే. ఈ వేలం లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ వేసిన ఒక పాచిక ఎంచక్కా పారి వారికి దాదాపుగా 5కోట్ల లాభాన్ని ఆర్జించిపెట్టింది. జయదేవ్ ఉనద్కత్ ని గత ఐపీఎల్ వేలంలో 8కోట్ల 50 లక్షల భారీ మొత్తాన్ని వెచ్చించి రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అతగాడిని ఉంచుకుంటే దాదాపుఆ 8 కోట్లు ఆగిపోతున్నాయని అతడిని రిలీజ్ చేసింది. 

also read IPL చరిత్రలో అత్యధిక ధర పలికింది వీరే

ఇక్కడిదాకా బాగానే ఉంది. నేడు వేలం మొదలవ్వగానే జయదేవ్ ఉనాద్కట్ పేరును బౌలర్ల కోటాలో బయటకు తీయగానే అనూహ్యంగా రాజస్థాన్ రాయల్స్ స్క్రీన్ మీదకు వచ్చింది. జయదేవ్ ఉనద్కత్ కోసం బిడ్డింగ్ లో పాల్గొనడం మొదలు పెట్టింది. కోటి రూపాయల మార్క్ దాటగానే ఇక రాజస్థాన్ రాయల్స్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గేలా కనపడలేదు. చివరాఖరకు అతన్ని 3 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకుంది. 

ఇలా చేయడం వల్ల వారికి 5 కోట్ల రూపాయల లాభం జరిగింది. అతన్ని వదిలేయడం వల్ల 8 కోట్ల రూపాయలను ఫ్రీ చేసుకున్నారు పంజాబ్ జట్టు. అలా 8 కోట్ల రూపాయలు మిగిలాయి. మల్లి వేలంలో అతడినే మరల కొనుక్కుంన్నారు. కాకపోతే ఈ సరి 5కోట్లు తక్కువ వెచ్చించి గత పర్యాయం కన్నా 5 కోట్ల తక్కువకు కేవలం 3 కోట్ల రూపాయలకే దక్కించుకున్నారు.

also read IPL Auction updates: హైదరాబాద్ కు విరాట్ సింగ్, అండర్ 19 ఇండియన్ కెప్టెన్ కూడా

వారికి ఈ చర్య వల్ల 5 కోట్లు మిగిలాయి, దానితోపాటు వారి ముఖ్యమైన బౌలర్ వారితోనే ఉండిపోయాడు. ఆ మిగిలిన డబ్బుతో రాజస్థాన్ రాయల్స్ మరికొంతమంది ప్లేయర్స్ ని కొనుక్కునే ఆస్కారం దక్కింది. ఈ విధంగా వారి విష్ణు చక్రం పాచిక చాలా బాగా పారి వారికి మంచి లాభం చేకూర్చింది అని చెప్పొచ్చు.

click me!