వింబుల్డన్‌లో రోజర్ ఫెదరర్‌కి షాక్... పోలాండ్ కుర్రాడి చేతిలో ఘోర ఓటమి...

Published : Jul 08, 2021, 10:41 AM IST
వింబుల్డన్‌లో రోజర్ ఫెదరర్‌కి షాక్... పోలాండ్ కుర్రాడి చేతిలో ఘోర ఓటమి...

సారాంశం

తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌కి అర్హత సాధించిన ఓ యువ ప్లేయర్ చేతుల్లో చిత్తుగా ఓడిన రోజర్ ఫెదరర్... గాయంతో ఇబ్బంది పడుతూ, మూడో సెట్‌లో ఒక్క పాయింట్ సాధించలేకపోయిన స్విస్ స్టార్...

కొన్నాళ్లుగా సరైన విజయాలు అందుకోలేకపోతున్న స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెదరర్‌కి మరోసారి చుక్కెదురైంది. వింబుల్డన్‌లో ఎనిమిది టైటిల్స్ గెలిచిన ఫెదరర్‌, తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్‌కి అర్హత సాధించిన ఓ యువ ప్లేయర్ చేతుల్లో చిత్తుగా ఓడి, ఘోర ఓటమి మూటకట్టుకున్నాడు..

పోలాండ్‌కి చెందిన హుబర్ట్ హుర్కజ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెదరర్ 3-6. 6-7 (4/7), 0-6 తేడాతో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్‌లో ఓడినా, రెండో సెట్‌లో అద్భుత పోరాటం కనబర్చిన ఫెదరర్, మూడో రౌండ్‌లో హుర్కజ్ జోరు ముందు నిలవలేకపోయాడు.

అదీకాకుండా ఈ మ్యాచ్‌లో ఫెదరర్ ఏకంగా 31 తప్పిదాలు చేసి, భారీ మూల్యం చెల్లించుకున్నాడు. గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలోనే నిష్కమించిన రోజర్ ఫెదరర్, వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్‌లోనే ఇంటిదారి పట్టాడు.

మరోవైపు నోవాక్ జోకోవిచ్ క్వార్టర్ ఫైనల్స్‌లో తన ప్రత్యర్థిని ఓడించి సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత స్టార్లు సానియా మీర్జా - రోహన్ బోపన్న జోడి పోరాటం ముగిసింది. ఈ ఇద్దరూ మూడో రౌండ్‌లో ఓడి, ఇంటిదారి పట్టారు. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !