ధోనీ బర్త్ డే... రైనా స్పెషల్ విషెస్

Published : Jul 07, 2021, 11:04 AM IST
ధోనీ బర్త్ డే... రైనా స్పెషల్ విషెస్

సారాంశం

గత ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలో సురేష్ రైనా సైతం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.   

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. పుట్టిన రోజు నేడు. ఈ రోజు ఆయన తన 40వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 


టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ (2007), వన్డే ప్రపంచ కప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథిగా మూడు పర్యాయాలు చాంపియన్‌గా నిలిపాడు. గత ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలో సురేష్ రైనా సైతం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 

కాగా.. నేడు ధోనీ పుట్టిన రోజు సందర్భంగా  సురేష్ రైనా బర్త్ డే విషెస్ తెలిపాడు. ‘హ్యాపీ బర్త్‌డే ధోనీ, నువ్వు నాకు స్నేహితుడు, సోదరుడు, మెంటార్‌గానూ వెంట నిలిచావు. మరింత కాలం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశాడు.


ఇక బీసీసీఐ కూడా స్పెషల్ విషెస్ తెలియజేసింది. ‘లెజెండ్ మరియు స్ఫూర్తివి.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని బీసీసీఐ విషెస్ తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే