దారి మళ్లీ భారత్‌లో దిగిన విమానం... శ్రీలంక క్రికెటర్ల ఆందోళన

By Siva KodatiFirst Published Jul 7, 2021, 7:56 PM IST
Highlights

శ్రీలంక క్రికెట్‌ జట్టు ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లడంతో క్రికెటర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి బయల్దేరిన శ్రీలంక క్రికెటర్ల విమానం ఇంధన సమస్య తలెత్తడంతో హఠాత్తుగా భారత్‌లో దించాల్సి వచ్చింది. దీంతో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఆందోళన చెందారు. 

శ్రీలంక క్రికెట్‌ జట్టు ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లడంతో క్రికెటర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి బయల్దేరిన శ్రీలంక క్రికెటర్ల విమానం ఇంధన సమస్య తలెత్తడంతో హఠాత్తుగా భారత్‌లో దించాల్సి వచ్చింది. దీంతో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఆందోళన చెందారు. ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్‌ మైక్‌ ఆర్థర్‌ వెల్లడించారు. భారత్‌లో దిగిన వెంటనే తన ఫోన్‌ ఆన్‌ చేశానని..  ఇంగ్లాండ్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ వేన్‌ బెంట్లీ నుంచి నాకు కొన్ని సందేశాలు వచ్చాయి. పరిస్థితి గురించి అందులో వివరించాడు. దాంతో నిజంగానే తామంతా ఆందోళన చెందాం అని ఆర్థర్‌ అన్నారు.

Also Read:ధోనీ, యువరాజ్ సింగ్ మధ్య గొడవలు రావడానికి ఆమే కారణమా? దీపికా పదుకొనేతో ప్రేమాయణం వల్లే...

మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీసు కోసం శ్రీలంక జట్టు ఇంగ్లాండ్‌కు వెళ్లింది. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓటమి పాలై పరువు పొగొట్టుకుంది. సిరీసు ముగిసిన అనంతరం లంక జట్టు స్వదేశానికి బయల్దేరింది. తీరా భారత్‌లో దిగాక విమానం దారి మళ్లించారన్న విషయం వారికి తెలియడంతో కంగారుపడ్డారు. కాగా లంకేయులతో ఆడిన ఇంగ్లాండ్‌ జట్టులో ముగ్గురు క్రికెటర్లు, నలుగురు సహాయ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దాంతో లంక క్రికెటర్లను ఐసోలేషన్‌కు పంపించనున్నారు. ఇదే సమయంలో భారత్‌, శ్రీలంక పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసు తేదీలు మారే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.  
 

click me!