పారిస్ ఒలింపిక్స్ 2024 లో మ‌ను భాక‌ర్ హ్యాట్రిక్ కొడుతుందా?

By Mahesh Rajamoni  |  First Published Jul 30, 2024, 11:59 PM IST

Manu Bhaker : పారిస్ ఒలింపిక్స్ 2024లో భార‌త స్టార్ షూట‌ర్లు మ‌ను భాక‌ర్-స‌రబ్జోత్ సింగ్ లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో దక్షిణ కొరియా జోడీ వోన్హో లీ, యే జిన్ ఓహ్‌లను ఓడించి భార‌త్ కు ఈ ఒలింపిక్స్ లో రెండో మెడ‌ల్ ను అందించారు. అయితే, మను భాకర్ హ్యాట్రిక్ మెడల్ సాధిస్తుందా?  
 


India's star shooter Manu Bhaker : భారత యువ స్టార్ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ 2024లో చరిత్ర సృష్టించారు. వరుసగా రెండు ఈవెంట్లలో కాంస్య పతకాలు సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్య‌క్తిగ‌త‌ ఈవెంట్‌లో మను భాక‌ర్ మొద‌ట‌ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆ త‌ర్వాత త‌న రెండో ఈవెంట్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మ‌రో బ్రాంజ్ మెడ‌ల్ ను గెలుచుకున్నారు. మ‌ను భాక‌ర్-స‌రబ్జోత్ సింగ్ లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో దక్షిణ కొరియా జోడీ వోన్హో లీ, యే జిన్ ఓహ్‌లను ఓడించి భార‌త్ కు ఈ ఒలింపిక్స్ లో రెండో మెడ‌ల్ ను అందించారు. ఈ క్ర‌మంలోనే మను భారీ రికార్డు సృష్టించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సాధించారు.

ఎలైట్ క్లబ్‌లోకి మను భాకర్.. 

Latest Videos

undefined

 

కాంస్య పతక పోరులో మను భాకర్, సరబ్జోత్ సింగ్ లు అద్భుత ప్రదర్శన చేశారు. వీరిద్దరూ దక్షిణ కొరియాకు చెందిన వోన్హో లీ, యే జిన్ ఓహ్ జోడీని ఓడించారు. ఈ మ్యాచ్‌ను మను, సరబ్‌జోత్‌లు 16-10 తేడాతో గెలుచుకున్నారు. మను భాక‌ర్  పతకం గెలిచిన వెంటనే తాను ఎలైట్ క్లబ్‌లో చేరారు. ఒలింపిక్ క్రీడల్లో భారత్ నుంచి రెండు పతకాలు సాధించిన మూడో క్రీడాకారిణిగా నిలిచింది. అతని కంటే ముందు రెజ్లర్ సుశీల్ కుమార్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రెండు ఒలింపిక్ పతకాలు సాధించారు. అలాగే, స్వాతంత్య్ర భారతంలో ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన ఏకైక ప్లేయర్ గా రికార్డు సృష్టించారు.

మను భాకర్ హ్యాట్రిక్ ఒలింపిక్ మెడ‌ల్ సాధిస్తుందా? 

 

పారిస్ ఒలింపిక్స్‌ను మ‌ను భాక‌ర్ కేవంలం రెండు మెడ‌ల్స్ తోనే ముగించ‌డం ఏ భార‌తీయుడికి ఇష్టం లేదు. మ‌ను హ్యాట్రిక్ పతకాలు సాధించాల‌ని కోరుకుంటున్నారు. అలాంటి సువర్ణావకాశం ఇప్పుడు ఆమెకు దక్కింది. మను భాక‌ర్ ఆగస్టు 2న మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో పాల్గొంటుంది. ఇప్పటి వరకు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సింగిల్స్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ లో రెండు పతకాలు గెలుచుకుంది. ఆగస్టు 2న జరిగే మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో మను రాణించి ఫైనల్స్‌కు వెళితే హ్యాట్రిక్ పతకాలు సాధించే గోల్డెన్ ఛాన్స్ ఉంటుంది. ఇదే గ‌న‌క జ‌రిగితే మ‌ను భాక‌ర్ పేరు భార‌త చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ 3  మెడ‌ల్స్ సాధించలేకపోయారు. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారతీయ షూటర్ మను భాకర్.

Ashwini Ponnappa: ఇదే నా చివరి ఒలింపిక్స్.. ఏడ్చేసిన‌ అశ్విని పొన్నప్ప

click me!