మా భార్యలతో కేవలం రెండువారాలేనా...: కోహ్లీ

By Arun Kumar PFirst Published Oct 8, 2018, 8:25 PM IST
Highlights

విదేశీ సీరీస్ లలో ఆటగాళ్ల వెంట వారి భార్యలు కూడా వెళుతుంటారు. అయితే బిసిసిఐ నిబంధనల ప్రకారం ఆ సీరిస్ ఎన్ని నెలలు సాగినా ఆటగాళ్ళ సతీమణులకు మాత్రం కేవలం రెండు వారాలే అనుమతి ఉంటుంది. దీంతో కొన్ని సార్లు క్రికెటర్లు తమ భార్యా, పిల్లల్ని వదిలి నెలల తరబడి ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. దీంతో ఈ నిబంధనపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యతిరేకత వ్యక్తం చేశాడు. దీన్ని వెంటనే మార్చాలంటూ బిసిసిఐ కి విజ్ఞప్తి చేశాడు. 
 
ఈ మేరకు కోహ్లీ బిసిసిఐ వ్యవహారాలను చూసుకుంటున్న వినోద్ రాయ్ నేతృత్వంలోని పాలక మండలి(సీఓఏ) ముందు తమ ఆవేదనను వెల్లడించినట్లు సమాచారం. కేవలం రెండు వారాలే కాకుండా సిరీస్‌ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు క్రికెటర్లతో పాటు భార్యలను కూడా అనుమతించాలని కోహ్లీ సీఓఏని కోరాడు. 

అయితే ఈ అభ్యర్థనపై తక్షణ నిర్ణయం తీసుకోలేమని సీఓఏ తేల్చిచెప్పింది. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని...దీనిపై కొత్తగా ఏర్పడే బిసిసిఐ కార్యవర్గమే నిర్ణయం తీసుకుంటుందని సీఓఏ అధికారులు తెలిపారు.  

సుదీర్ఘ సీరీస్ లలో తమ భార్యలను, పిల్లలను వదిలి ఉండలేక మ్యాచ్ లపై ఏకాగ్రత పెట్టలేకపోతుననామని పలువురు క్రికెటర్లు గతంలో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే అధికారులు వాదనర మరో విధంగా ఉన్నాయి. భార్యాపిల్లలతో కలిసుంటే ఆటగాళ్ల తమ ప్రాక్టీస్ కు సరిగ్గా హాజరుకాకపోవడంతో పాటు ఆటపై ఏకాగ్రత నిలపలేకపోతున్నారని అంటున్నారు. అందువల్లే ఈ నిబంధన విధించినట్లు చెబుతున్నారు.
 
click me!