అంపైర్ పై అసహనం... రోహిత్ కి జరిమానా

By telugu teamFirst Published Apr 29, 2019, 2:25 PM IST
Highlights

ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకి .. మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. కోపంతో రోహిత్ వ్యవహరించిన తీరు కారణంగానే... ఆయనకు రావాల్సిన ఫీజులో 15శాతం జరిమానా విధించారు.

ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకి .. మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. కోపంతో రోహిత్ వ్యవహరించిన తీరు కారణంగానే... ఆయనకు రావాల్సిన ఫీజులో 15శాతం జరిమానా విధించారు.

పూర్తి మ్యాటర్ లోకి వెళితే... ఆదివారం ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ళ రైడర్స్ తలపడిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అస‌హ‌నానికి లోన‌య్యాడు. అంపైర్ మీద కోపంతో అత‌ను వికెట్ బెయిల్స్‌ను ప‌డ‌గొట్టాడు. 

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా 20 ఓవ‌ర్ల‌లో 232 ర‌న్స్ చేసింది. భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ముంబైకి నాలుగ‌వ ఓవ‌ర్‌లోనే షాక్ త‌గిలింది. 12 ర‌న్స్ చేసిన రోహిత్‌ను ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ చేశారు. హ్యారీ గుర్నే బౌలింగ్‌లో అత‌ను ఔట‌య్యాడు. అంపైర్ ఎల్బీడ‌బ్ల్యూ ఔట్ ఇవ్వ‌డంతో.. రోహిత్ డీఆర్ఎస్ రివ్యూ కోసం వెళ్లాడు. అయితే డిఆర్ఎస్ కూడా అంపైర్స్ కాల్‌కు ఓకే చెప్పింది. దీంతో రోహిత్ ఔట‌య్యాడు. 

இது வேர குருக்கால சனிய 😂Hitman pic.twitter.com/uiEzBTdtdT

— A.R.Saravanan (@sr_twitz)

 

అంపైర్ నిర్ణ‌యంతో అసంతృప్తికి లోను అయిన రోహిత్ శ‌ర్మ‌.. మైదానం విడిచి వెళ్లే క్ర‌మంలో త‌న బ్యాట్‌తో కావాల‌నే వికెట్ల‌ను కొట్టాడు. నాన్‌స్ట్ర‌యిక‌ర్ ఎండ్‌లో ఉన్న వికెట్ బెయిల్స్‌ను కొంద‌ప‌డేశాడు. దీంతో.. రోహిత్ చేసిన పనికి జరిమానా విధించారు. 

click me!